Physical Endurance Tests: ఎస్సై పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఎస్సై పోస్టుల రెందో దశ ఎంపిక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు చేపడుతున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో 9,689 మంది అభ్యర్థులు పరీక్షలకు ఎంపిక అయ్యారు. ఆగస్టు 25 నుంచి వివిధ పోటీలు నిర్వహించి సత్తా చాటుకున్న అభ్యర్థులను తుది దశ పరీక్షలకు ఎంపిక చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్వీయ పర్యవేక్షణలో పోటీలు పగడ్బందీగా చేపడుతున్నారు. సోమవారం సుమారు 800 మంది అభ్యర్థులు వివిధ పోటీలకు హాజరుకావాల్సి ఉండగా 699 మంది పాల్గొన్నారు. తొలుత అభ్యర్థులకు సంబంధించి ఎత్తు, చాతి, బరువు వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అనంతరం 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు పోటీలు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. డీఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎంపిక పరీక్షల్లో ఎక్కడా అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోటీలు చేపడుతున్నామన్నారు.
చదవండి: Physical Endurance Test: ఎస్‌ఐ పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి