రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఎవరు పాల్గొన్నారు?
1. భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం ప్రవేశపెట్టిన అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) కేంద్రంలో, ప్రావిన్స్ లలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు
2) ప్రావిన్స్ లలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు
3) ప్రావిన్స్ లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు
4) ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు
- View Answer
- సమాధానం: 1
2. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఎవరు పాల్గొన్నారు?
1) భారత ప్రజలందరూ
2) వయోజనులైన భారతీయులందరూ
3) జమీందారులు, స్వదేశీ సంస్థానాల రాజులు
4) ప్రాంతీయ శాసన సభలు
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ) జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, వల్లభాయ్ పటేల్ - రాజ్యాంగ పరిషత్ సభ్యులు
బి) రాజ్యాంగ పరిషత్ ఎన్నికలను 1946 లో నిర్వహించారు
సి) రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389
డి) రాజ్యాంగ పరిషత్ మొదటి సెషన్ సమావేశాలను 1947 జనవరిలో ప్రారంభించారు
1) బి, సి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 1
4. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ‘సమానత్వ హక్కు’కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) చట్టం ముందు అందరూ సమానమే, చట్టాలు అందరికీ సమాన రక్షణ కల్పించాలి
బి) జాతి, కుల, మత వివక్ష చూపరాదు
సి) ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలి
డి) ఆస్తి, సంపదను సమానంగా పంపిణీ చేయాలి
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) సి, డి
- View Answer
- సమాధానం: 2
5. 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ప్రకారం ఆస్తిహక్కుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రాజ్యం.. ఒక వ్యక్తి ఆస్తిని చట్ట ప్రకారం తీసుకోవచ్చు
బి) సమాజ సంక్షేమం దృష్ట్యా రాజ్యం.. వ్యక్తి ఆస్తిని తీసుకోవచ్చు
సి) ప్రైవేట్ ఆస్తిని పొందేటప్పుడు సరైన పరిహారం చెల్లించాలి
డి) కార్యనిర్వాహక చర్యల నుంచి ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవచ్చు
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి
4) సి, డి
- View Answer
- సమాధానం: 2
6. బలవంతంగా వేలిముద్రలు తీసుకోవడం, నార్కో అనాలసిస్ టెస్టులు చేయడం.. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొంది?
1) 21
2) 21, 20(1)
3) 21, 20(2)
4) 21, 20(3)
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో సరైన వ్యాఖ్యలేవి?
ఎ) ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు
బి) ప్రాథమిక హక్కులను సవరించడానికి వీల్లేదు
సి) ఒకే నేరానికి రెండుసార్లు శిక్షించరాదు
డి) కేంద్ర ప్రభుత్వ కార్య నిర్వాహక (Executive) స్వరూపాన్ని మార్చవచ్చు
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
8. కింది వాటిలో రాజ్యాంగం వేటిని గుర్తించింది?
1) మతపరమైన మైనార్టీలు
2) భాషాపరమైన మైనార్టీలు
3) 1, 2
4)మత, భాషా, ప్రాంతీయ మైనార్టీలు
- View Answer
- సమాధానం: 3
9. అధికరణ 25 ప్రకారం.. కింద పేర్కొన్న ఏ అంశాలకు సంబంధించి మత స్వేచ్ఛపై పరిమితులు విధించారు?
1) ప్రజా సంక్షేమం
2) నైతిక విలువలు
3) 1, 2
4) షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
- View Answer
- సమాధానం: 3
10. ఏయే అధికరణల్లో పేర్కొన్న ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ‘ఆధిక్యత’ కల్పించారు?
1) 48(a), 49(b), 39(c)
2) 39(b), 39(c)
3) 39(a), 39(b), 39(c)
4) అన్ని ఆదేశ సూత్రాలు
- View Answer
- సమాధానం: 2
11. రాష్ట్రపతి.. కింద పేర్కొన్న ఏయే సందర్భాల్లో ‘రాష్ట్రపతి పాలన’ విధిస్తారు?
ఎ) రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేని సందర్భంలో
బి) రాష్ట్ర గవర్నర్.. రాష్ట్రపతి పాలన విధించాలని నివేదిక ఇచ్చినప్పుడు
సి) రాష్ట్రంలో ‘రాజ్యాంగం’ ప్రకారం పాలన జరగని సందర్భంలో
డి) రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు
1) ఎ, బి, సి
2) బి, సి
3) బి, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
12.కింద పేర్కొన్న ఏయే ప్రాథమిక హక్కులు రాజ్యం, ప్రైవేట్ వ్యక్తులకు వర్తిస్తాయి?
ఎ) బహిరంగ ప్రదేశాల్లో సమానత్వం పాటించడం
బి) విదేశాల నుంచి బిరుదులు స్వీకరించడం
సి) భావ ప్రకటన స్వేచ్ఛ
డి) పిల్లలతో కఠినమైన, కర్మాగారాల్లో పనులు చేయించకూడదు
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) సి, డి
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 2
13. రాజ్యాంగ అధికరణలు - పేర్కొనే అంశాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1) i-e, ii-b, iii-d, iv-c, v-a జాబితా - I(అధికరణ) జాబితా - II(సంబంధించిన అంశం) i) 74(1) a) కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించాలి. ii) 77 b) ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ రాష్ట్రపతి పేరుపైనే నిర్వహించాలి. iii) 75(1) c) ప్రధాని.. ప్రభుత్వ సమాచారాన్ని రాష్ట్రపతికి తెలపడం iv) 78 d) కేంద్ర మంత్రిమండలి నియామకం v) 75(3) e) మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి పాలన నిర్వహించాలి
2) i-e, ii-b, iii-c, iv-d, v-e
3) i-e, ii-a, iii-d, iv-c, v-b
4) i-e, ii-d, iii-c, iv-b, v-a
- View Answer
- సమాధానం: 1
14. రాజ్యాంగ నిర్మాతలు ‘భారత రాజ్యాంగం’ తన అధికారాన్ని ఎక్కడి నుంచి పొందినట్లు పేర్కొన్నారు?
1) భారత పార్లమెంట్
2) భారత ప్రజలు
3) బ్రిటిషర్లు
4) రాజ్యాంగ పరిషత్
- View Answer
- సమాధానం: 2
15. లోక్‌సభ స్పీకర్.. కింద పేర్కొన్న ఏ సందర్భంలో ఓటుహక్కు వినియోగించుకుంటారు?
1) సభ కోరినప్పుడు
2) ఆయనకు సంబంధించిన పార్టీ కోరినప్పుడు
3) 1, 2
4) సభలో ఓట్లు సమానంగా వచ్చినప్పుడు (నిర్ణాయక ఓటుహక్కు)
- View Answer
- సమాధానం: 4
16. పార్లమెంట్లో ‘బడ్జెట్’ను ఎవరు ప్రవేశపెడతారు?
1) ప్రధానమంత్రి
2) రాష్ట్రపతి
3) ఆర్థిక మంత్రి
4) ఆర్థికశాఖ కార్యదర్శి
- View Answer
- సమాధానం: 3
17. కింది వాటిలో ‘జిల్లా మెజిస్ట్రేట్’ విధి కానిది ఏది?
1) జిల్లాలో భూమిశిస్తు వసూలు
2) పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేయడం
3) స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం
4) శాంతిభద్రతలు కాపాడటం
- View Answer
- సమాధానం: 3
18. ‘పంచాయతీ రాజ్ వ్యవస్థ.. ఒక విఫలమైన దేవుడు’ అని వ్యాఖ్యానించిన కమిటీ ఏది?
1) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) రాజీవ్ గాంధీ కమిటీ
4) జి.వి.కె. రావు కమిటీ
- View Answer
- సమాధానం: 2
19. దేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1726
2) 1687
3) 1787
4) 1678
- View Answer
- సమాధానం: 2
20. ‘సోలి సొరాబ్జీ’ కమిటీ దేనికి సంబంధించింది?
1) క్రిమినల్ న్యాయ సంస్కరణలు
2) పరిపాలన సంస్కరణలు
3) సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు
4) పోలీస్ న్యాయ సంస్కరణలు
- View Answer
- సమాధానం: 4
21. ‘ప్రవేశిక’కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ) భారత రాజ్యాంగ స్వభావాన్ని తెలుపుతుంది
బి) భారత రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతుంది
సి) భారత రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరో తెలుపుతుంది
డి) భారత రాజ్యాంగం ఆమోదం గురించి తెలుపుతుంది
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, సి
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 1
22. కింద పేర్కొన్న అంశాల సరైన కాలానుగుణక్రమం తెలపండి.
ఎ) ఫెడరల్ ప్రభుత్వం
బి) భారత రాజ్యాంగాభివృద్ధి
సి) భారత రాజ్యాంగం
డి) భారత రాజకీయ వ్యవస్థ
1) బి, సి, ఎ, డి
2) బి, సి, డి, ఎ
3) ఎ, బి, సి, డి
4) డి, సి, బి, ఎ
- View Answer
- సమాధానం: 1
23. రాజ్యాంగంలో ఉన్న భాగాల ప్రకారం.. కింద పేర్కొన్న అంశాల సరైన వరస క్రమం ఏది?
ఎ) కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు
బి) కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
సి) రాజ్యాంగ సవరణ విధానం
డి) అత్యవసర పరిస్థితులు
ఇ) కేంద్రపాలిత ప్రాంతాలు
1) ఇ, ఎ, బి, డి, సి
2) ఇ, ఎ, డి, బి, సి
3) డి, ఇ, ఎ, బి, సి
4) ఎ, ఇ, డి, బి, సి
- View Answer
- సమాధానం: 1
24. రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిధ్యం వహించిన సభ్యుల సంఖ్య ఆధారంగా కింది ప్రావిన్స్ ల సరైన ఆరోహణ క్రమం ఏది?
ఎ) యునెటైడ్ ప్రావిన్స్
బి) బిహార్
సి) సెంట్రల్ ప్రావిన్స్
డి) మద్రాస్
ఇ) వాయవ్య సరిహద్దు రాష్ట్రం
1) ఇ, ఎ, బి, సి, డి
2) ఎ, ఇ, బి, సి, డి
3) ఎ, డి, బి, సి, ఇ
4) ఎ, డి, బి, ఇ, సి
- View Answer
- సమాధానం: 3
25. A - వర్గం రాష్ట్రాల్లో మొత్తం రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య?
1) 292
2) 178
3) 187
4) 70
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించని కమిటీ ఏది?
1) అశోక్‌మెహతా కమిటీ
2) రాజమన్నార్ కమిటీ
3) పూంచీ కమిటీ
4) వీరప్ప మొయిలీ కమిటీ
- View Answer
- సమాధానం: 1
27. అధికరణ-131 దేనికి సంబంధించింది?
1) సుప్రీంకోర్టు అప్పీళ్ల విచారణ పరిధి
2) సుప్రీంకోర్టు ప్రథమ విచారణ పరిధి
3) సుప్రీంకోర్టు సలహా అధికార పరిధి
4) సుప్రీంకోర్టు సాధారణ అధికార పరిధి
- View Answer
- సమాధానం: 2
28. హైకోర్టు అధికార పరిధిని మార్చే అధికారం ఎవరికి ఉంది?
1) పార్లమెంట్
2) రాష్ట్ర శాసన శాఖ సలహాతో పార్లమెంట్
3) రాష్ట్రపతి సలహాతో పార్లమెంట్
4) పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు
- View Answer
- సమాధానం: 4
29. రాష్ట్ర హైకోర్టు జడ్జీలుగా పనిచేసి పదవీ విరమణ పొందినవారికి పెన్షన్‌ను ఏ నిధి నుంచి చెల్లిస్తారు?
1) భారత సంఘటిత నిధి
2)ఏ రాష్ట్ర హైకోర్టు నుంచి పదవీ విరమణ చేస్తారో.. ఆ రాష్ట్ర సంఘటిత నిధి
3) 1 లేదా 2
4) రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఉంటుంది
- View Answer
- సమాధానం: 1
30. ఒక హైకోర్టు పరిధిని రెండు లేదా మూడు రాష్ట్రాలకు పెంచే అధికారం ఎవరికి ఉంది?
1) భారత పార్లమెంటు
2) భారత రాష్ట్రపతి
3) రాష్ట్ర గవర్నర్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
31. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) బి.ఎన్.రావు. చిత్తు రాజ్యాంగం (1947) - 243 అధికరణలు, 13 షెడ్యూళ్లు
బి) అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగం (1948) - 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు
సి) 1950 భారత రాజ్యాంగం - 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం - 321 అధికరణలు, 104 షెడ్యూళ్లు
ఇ) ప్రస్తుత భారత రాజ్యాంగం - 495 అధికరణలు, 10 షెడ్యూళ్లు
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి, డి, ఇ
3) ఇ, డి
4) ఎ, బి, సి, ఇ
- View Answer
- సమాధానం: 1
32. ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (Public Interest Litigation)’ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1) సమాఖ్య ప్రభుత్వ ఔన్నత్యం
2) న్యాయశాఖ ఔన్నత్యం
3) పార్లమెంటరీ సార్వభౌమాధికారం
4) జవాబుదారీతనం
- View Answer
- సమాధానం: 4
33. భారతదేశంలో ‘ఫెడరల్ కోర్టు’ స్థానంలో దేన్ని ఏర్పాటు చేశారు?
1) మేయర్ కోర్టు
2) ప్రివీ కౌన్సిల్
3) సుప్రీంకోర్టు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
34. కింది వాటిలో ప్రజాభిప్రాయాన్ని అధికారికంగా వ్యక్తం చేసేది ఏది?
1) ప్రింట్ మీడియా
2) పార్లమెంట్
3) ప్రభావ వర్గాలు
4) ఎన్జీవోలు
- View Answer
- సమాధానం: 2