ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతి ఎవరు?
1. భారతదేశంలో పరిపాలన మొత్తం రాష్ర్టపతి పేరు మీదనే కొనసాగుతుందని తెలిపే అధికరణ?
1) 53
2) 74
3) 75
4) 77
- View Answer
- సమాధానం: 4
వివరణ: అధికరణ-77 ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ర్టపతి పేరు మీదనే కొనసాగుతుంది. దీనిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అధికరణ-53 ప్రకారం దేశంలో కార్యనిర్వహణ అధికారాలు రాష్ర్టపతికే చెందుతుందని తెలుపుతుంది. అధికరణ-74(1) ప్రకారం రాష్ర్టపతి ఈ అధికారాన్ని చెలాయించటానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా ఇస్తుందని తెలుపుతుంది. దీని ప్రకారం రాష్ర్టపతి నామమాత్రపు అధికారి కాగా, ప్రధానమంత్రి వాస్తవ అధికారిగా ఉంటాడు.
- సమాధానం: 4
2. రాష్ర్టపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం?
1. ఫ్రాన్స
2. ఐర్లాండ్
3. అమెరికా
4. నార్వే
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్టపతి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. దీన్ని రాజ్యాంగ పరిషత్‌లో ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ ప్రతిపాదించాడు. రాష్ర్టపతి ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. దీనికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఒకసారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ మరోసారి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. రాష్ర్టపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు.
- సమాధానం: 2
3. రాష్ర్టపతిని ఎన్నుకునే ‘ఎన్నికల గణం’లో కింది వారిలో సభ్యులు కానివారు?
1. పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నికైన సభ్యులు
2. పార్లమెంట్ ఉభయసభలకు నియామక సభ్యులు
3. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు
4. కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్టపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల గణం (Electrol
college) ఏర్పడుతుంది. ఇందులో కేంద్ర, రాష్ర్ట స్థాయిలో చట్టసభలకు ఎన్నికైన సభ్యులకే, అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఉభయసభలకు; అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు; ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులకు అవకాశం ఉంటుంది. అదే విధంగా లోక్‌సభకు నియమించబడిన ఆంగ్లో-ఇండియన్ సభ్యులకు, రాజ్యసభకు నియమించబడిన విశిష్ట వ్యక్తులకు, రాష్ట్రాల అసెంబ్లీలకు నియమించబడిన ఆంగ్లో-ఇండియన్ సభ్యులకు, రాష్ట్రాల విధాన పరిషత్‌కు ఎన్నికైన, నియామక సభ్యులకు సభ్యత్వం ఉండదు.
- సమాధానం: 2
4. కింది వాటిలో భారత రాష్ర్టపతి అధికారం కానిది?
1) సమన్
2) ప్రోరోగ్
3) డిజల్యూషన్
4) అడ్జర్న
- View Answer
- సమాధానం: 4
వివరణ: ‘అడ్జర్న’ అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేయడం. లోక్‌సభను అడ్జర్న చేసే అధికారం లోక్‌సభ స్పీకర్‌కు ఉంటుంది.
‘సమన్’ అంటే పార్లమెంట్‌ను సమావేశపరచటం; ‘ప్రోరోగ్’ అంటే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని ప్రకటించడం లేదా దీర్ఘకాలికంగా వాయిదా వేయటం; డిజల్యూషన్ అంటే ప్రధాని సలహాపై రాష్ర్టపతి లోక్‌సభను రద్దు చేయటం. ఈ మూడు అధికారాలు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ర్టపతికే కల్పించారు.
- సమాధానం: 4
5. భారత రాష్ర్టపతికి కింది వాటిలో ఏ రకమైన వీటో అధికారం లేదు?
1) నిరపేక్ష వీటో
2) సస్పెన్సివ్ వీటో
3) పాకెట్ వీటో
4) క్వాలిఫైడ్ వీటో
- View Answer
- సమాధానం: 4
వివరణ: వీటో అంటే తిరస్కారం అని అర్థం. భారత రాష్ర్టపతికి ఈ కింది మూడు రకాల వీటో అధికారాలు ఉంటాయి.
ఎ) నిరపేక్ష వీటో: రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆ రాష్ర్ట గవర్నర్ రాష్ర్టపతి అనుమతికి రిజర్వ చేసిన బిల్లులను, పార్లమెంట్ ఆమోదించిన ప్రైవేట్ సభ్యుని బిల్లులను తిరస్కరించే అధికారం రాష్ర్టపతికి ఉంటుంది. దీనినే నిరపేక్ష వీటో అంటారు.
బి) సస్పెన్సివ్ వీటో: పార్లమెంట్ ఆమోదించిన సాధారణ బిల్లులను రాష్ర్టపతి మళ్లీ పార్లమెంట్‌కు పునఃపరిశీలనకై పంపవచ్చు. ఒకవేళ అదే బిల్లును మార్పులతో గాని లేదా మార్పులు లేకుండా గాని తిప్పి పంపినప్పుడు రాష్ర్టపతి తప్పకుండా సంతకం చేయాలి.
సి) పాకెట్ వీటో: పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు తన ఆమోదాన్ని, తిరస్కారాన్ని తెలుపకుండా రాష్ర్టపతి ఆ బిల్లుని తన వద్దే ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన పోస్టల్ బిల్లుపై నాటి రాష్ర్టపతి జైల్‌సింగ్ పాకెట్ వీటో ప్రయోగించాడు. అమెరికా అధ్యక్షుడికి ఉండే క్వాలిఫైడ్ వీటో భారత రాష్ర్టపతికి లేదు.
- సమాధానం: 4
6. భారత రాష్ర్టపతి ఎన్నికల్లో రెండో లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతి ఎవరు?
1) నీలం సంజీవరెడ్డి
2) వి.వి. గిరి
3) ఫకృద్ధీన్ అలీ అహ్మద్
4) ఆర్.వెంకట్రామన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్టపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు. ఈ పద్ధతి ప్రకారం కనీసం 50% ఓట్లు గెలుచుకున్న వారే రాష్ర్టపతిగా ఎన్నికవుతారు. ఒకవేళ మొదటి లెక్కింపులో ఎవరికీ 50% రానప్పుడు రెండో లెక్కింపు చేపడతారు. అప్పుడు కూడా రానిచో మూడో లెక్కింపు చేపట్టి 50% ఓట్లు వచ్చే వరకు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.
1969లో ఐదో రాష్ర్టపతి ఎన్నికల్లో మొదటి లెక్కింపులో ఎవరికి కూడా 50% ఓట్లు రాలేదు. వి.వి. గిరి మొదటి స్థానంలో, నీలం సంజీవ రెడ్డి రెండో స్థానంలో, సి.డి. దేశ్‌ముఖ్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ ఎవరికి 50% ఓట్లు రాలేదు. అప్పుడు సి.డి. దేశ్‌ముఖ్‌కు లభించిన ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచగా స్వతంత్ర అభర్థి వి.వి.గిరికి 50.9% ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డికి 49.1% లభించాయి. ఈ విధంగా రెండో లెక్కింపు ద్వారా వి.వి. గిరి రాష్ర్టపతిగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 2
7. కింది ఏ బిల్లులు విషయంలో రెండు సభల మధ్య వైరుధ్యం వస్తే రాష్ర్టపతి సంయుక్త సమావేశంను ఏర్పాటు చేస్తాడు?
1) సాధారణ బిల్లు
2) ద్రవ్య బిల్లు
3) రాజ్యాంగ సవరణ బిల్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సాధారణ బిల్లుల ఆమోదంలో పార్లమెంట్ ఉభయసభల మధ్య వైరుధ్యం అంటే ఒక సభ ఆమోదించి, మరో సభ ఆమోదించినప్పుడు రాష్ర్టపతి ఆర్టికల్ 108 ప్రకారం సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. స్పీకర్ అధ్యక్షత వహించే సంయుక్త సమావేశంలో బిల్లుకు మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపితే చట్టం అవుతుంది. లేనిచో బిల్లు వీగిపోతుంది.
ఇప్పటి వరకు మూడు సార్లు సంయుక్త సమావేశాలు జరుగగా మూడు సార్లు బిల్లులు ఆమోదించబడ్డాయి.
అవి..
1. వరకట్న నిషేధ బిల్లు (1961)
2. బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు (1978)
3. పోటా బిల్లు (2002)
- సమాధానం: 1
8. భారత రాష్ర్టపతి ఏ సందర్భంలో ఆర్డినెన్స్ జారీ చేస్తాడు?
1) పార్లమెంట్ సమావేశంలో ఉన్పప్పుడు
2) పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు
3) పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఉన్నప్పుడు
4) పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఉన్నప్పుడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: పార్లమెంట్ సమావేశంలో లేని సందర్భాన్ని ‘రిసెస్’ అంటారు. ఈ సందర్భంలో అత్యవసరంగా శాసనం అవసరం అయితే రాష్ర్టపతి క్యాబినేట్ సలహా ప్రకారం ఆర్టికల్-123 ప్రకారం ఆర్డినెన్స జారీ చేస్తాడు. దీనినే అత్యవసర శాసనం లేదా రాష్ర్టపతి జారీచేసే శాసనం అంటారు. దీని కాలపరిమితి 6 నెలలు. పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత 6 వారాల్లోపు దీనిని ఆమోదిస్తే చట్టం అవుతుంది. భారత రాష్ర్టపతి కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలపై ఆర్డినెన్స జారీ చేస్తాడు.
- సమాధానం: 2
9. భారత రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహాను కోరే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం?
1) ఫ్రాన్స
2) అమెరికా
3) ఐర్లాండ్
4) కెనడా
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో ఏదైన అంశంపై న్యాయ సలహాకై రాష్ర్టపతి ఆర్టికల్-143 ప్రకారం సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. దీనిని కెనడా నుంచి స్వీకరించాం. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ సలహా ఇస్తుంది. ఇది కేవలం సలహాపరమైంది మాత్రమే. రాష్ర్టపతి దీనికి కట్టుబడి ఉండనవసరం లేదు.
ఇప్పటికి వివిధ సందర్భాల్లో భారత రాష్ర్టపతులు 15 సార్లు సుప్రీంకోర్టు సలహా కోరారు. 1951లో ఢిల్లీ న్యాయ చట్టం, 1958లో కేరళ విద్యా బిల్లు విషయంలో, 1960లో బేరుబరి వివాదంలో రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ సుప్రీంకోర్టు సలహా కోరాడు. 2012లో 2జీ స్పెక్ట్రం వివాదంలో కూడా రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరాడు. అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహా కోరిన రాష్ర్టపతి బాబు రాజేంద్రప్రసాద్.
- సమాధానం: 4
10. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: యుద్ధం, విదేశీ దాడి, సాయుధ తిరుగుబాటు సందర్భంలో ప్రధాని నేతృత్వంలో కేంద్ర క్యాబినేట్ లిఖిత సలహా ప్రకారం రాష్ర్టపతి ఆర్టికల్-352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. ఇప్పటి వరకు దీనిని మూడు సార్లు విధించారు.
అవి..
1) 1962 అక్టోబర్ 26న భారత్‌పై చైనా దాడి సందర్భంగా నాటి ప్రధాని నెహ్రూ సలహా ప్రకారం రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విధించాడు.
2) 1971 డిసెంబర్ 3న భారత్-పాక్ యుద్ధ సందర్భంలో ప్రధాని ఇందిరా గాంధీ సలహా ్రపకారం నాటి రాష్ర్టపతి వి.వి. గిరి విధించాడు.
3) 1975 జూన్ 25న అంతర్గత కల్లోలం కారణంగా ప్రధాని ఇందిరా గాంధీ సలహా ప్రకారం నాటి రాష్ర్టపతి ఫకృద్ధీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాడు.
- సమాధానం: 3
11. ప్రభుత్వానికి అత్యవసర ఖర్చు నిమిత్తం భారత రాష్ర్టపతి వద్ద ఉండే ప్రత్యేక నిధి?
1) భారత సంఘటిత నిధి
2) భారత అగంతుక నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్-267 ప్రకారం భారత అగంతుక నిధి ఏర్పడింది. దీనినే అత్యవసర నిధి లేదా ఆపత్కాల నిధి అని కూడా అంటారు. ప్రకృతి వైపరిత్యాలు, క్షామం వంటి సందర్భాల్లో అత్యవసరంగా వ్యయం చెల్లించడానికి రాష్ర్టపతి వద్ద ఈ ఆగంతుక నిధిని, 1950-ఆగంతుక నిధి చట్టం ప్రకారం ప్రారంభించబడింది. దీని నుంచి చెల్లించే చెల్లింపులకు పార్లమెంట్ అనుమతి తర్వాత పొందవచ్చు. రాష్ర్ట స్థాయిలో రాష్ర్ట ఆగంతుక నిధి గవర్నర్ వద్ద ఉంటుంది.
- సమాధానం: 2
12. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను బి.ఆర్. అంబేడ్కర్ ‘మృత పత్రంగా’ పేర్కొన్నారు?
1) 352
2) 356
3) 360
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాజ్యాంగంలోని రాష్ర్టపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్ - 356ను బి.ఆర్.అంబేడ్కర్ మృత పత్రంగా పేర్కొన్నాడు. రాజ్యాంగ పరిషత్‌లో చర్చ సందర్భంగా దీనిని భవిష్యత్తులో దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు, దానికి అంబేడ్కర్ ఈ ఆర్టికల్ దేశభద్రతకు ఐక్యతకు అవసరం. అదే విధంగా దీనిని ఎప్పుడు వినియోగించని ఆర్టికల్‌గా ఒక ‘మృత పత్రంగా’ మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు.
- సమాధానం: 2
13. సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత రాష్ర్టపతి పాలన విధించడం (ఆర్టికల్-356) తగ్గింది?
1) ఇందిరాసహనీ కేసు
2) రామ్‌లాల్ కేసు
3) కేశవానంద భారతీ కేసు
4) ఎస్.ఆర్.బొమ్మైకేసు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సరైన కారణం లేకుండా ఇష్టానుసారంగా రాష్ర్టపతి పాలన విధిస్తే న్యాయసమీక్ష చేసే అధికారం తనకు ఉందని సుప్రీంకోర్టు 1994 మార్చి 11న ఎస్.ఆర్. బొమ్మైకేసులో తీర్పునిచ్చింది. జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిస్తూ లౌకికతత్వం, సమాఖ్య భారత రాజ్యాంగ మౌలిక పునాది అని పేర్కొంటూ వీటికి విఘాతం కలిగిస్తే రాష్ర్టపతి పాలన విధించవచ్చని తీర్పునిస్తూ దుర్వినియోగం మాత్రం చేయవద్దని వ్యాఖ్యానించింది. ఎస్ఆర్ బొమ్మైకేసు తర్వాత రాష్ర్టపతి పాలన విధింపు దుర్వినియోగం తగ్గింది.
- సమాధానం: 4
14. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతి ఎవరు?
1) బాబు రాజేంద్రప్రసాద్
2) జాకీర్ హుస్సేన్
3) నీలం సంజీవరెడ్డి
4) జ్ఞానీ జైల్‌సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాష్ర్టపతి పదవికి 15సార్లు ఎన్నికలు నిర్వహించగా ఒకేఒకసారి 1977లో ఎన్నిక లేకుండా ఏకగ్రీవం జరిగింది. నీలం సంజీవరెడ్డి ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1977లో రాష్ర్టపతి ఫకృద్ధీన్ అలీ అహ్మద్ మరణంతో రాష్ర్టపతి ఎన్నిక నిర్వహించారు. నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ మద్దతుతో నామినేషన్ వేయగా మరో 36 మంది నామినేషన్ వేసినప్పటికీ అవన్నీ నిబంధనల మేరకు లేనందున తిరస్కరించబడ్డాయి. తద్వారా బరిలో నిలిచిన నీలం సంజీవరెడ్డి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతిగా నిలిచాడు.
- సమాధానం: 3
15. భారత రాష్ర్టపతిగా అత్యధిక సార్లు పోటీచేసిన వ్యక్తి?
1) బాబు రాజేంద్రప్రసాద్
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) నీలం సంజీవరెడ్డి
4) చౌదరి హరిరామ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: హరియాణ రాష్ర్టం రోహ్తక్కు చెందిన రైతు నాయకుడు చౌదరి హరిరామ్ అత్యధిక సార్లు రాష్ర్టపతిగా పోటీ చేసిన వ్యక్తిగా రికార్డ సృష్టించాడు. ఇతను 1952, 1957, 1962, 1967, 1969లో వరుసగా 5 సార్లు పోటీ చేసినప్పటికి రాష్ర్టపతిగా ఎన్నిక కాలేదు. 1952లో నాల్గో స్థానంలో, 1957లో రెండో స్థానంలో, 1962లో రెండో స్థానంలో నిలువగా, 1967 ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా రాలేదు. 1969లో 8వ స్థానంలో నిలిచాడు.
బాబు రాజేంద్రప్రసాద్ 1952, 1957లో రెండుసార్లు పోటీచేసి రెండుసార్లు రాష్ర్టపతిగా ఎన్నికయ్యాడు. నీలం సంజీవరెడ్డి కూడా రెండు సార్లు పోటీచేస్తే 1969లో వి.వి.గిరి చేతిలో ఓడిపోగా; 1977లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 4