ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
Sakshi Education
1. ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది?
1) అమెరికాలో ‘బిల్ ఆఫ్ రైట్’ చట్టం
2) ఫ్రెంచి విప్లవ సందర్భంలో ‘హక్కుల ప్రకటన
3) ఇంగ్లండ్‌లో ‘మాగ్నాకార్టా’ చట్టం
4) ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ‘మానవ హక్కుల ప్రకటన
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టంగా ‘మాగ్నాకార్టా’ను చెప్పవచ్చు. దీనిని 1215 సంవత్సరం జూన్ 15న ఇంగ్లండ్ రాజు కింగ్ జాన్ దీనిని ప్రకటిస్తూ ప్రజలకు స్వేచ్ఛ, హక్కులను కల్పించాడు. ‘మాగ్నా’ అంటే పెద్దది, ‘కార్టా’ అంటే ఒప్పందం అని అర్థం. 2015 జూన్ 15న దీనిని రూపొందించి 800 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంగ్లండ్‌లో ఉత్సవాలు జరిగాయి.
- సమాధానం: 3
2. ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
1) 1976
2) 1977
3) 1978
4) తొలగించలేదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి తొలగించలేదు. భారత రాజ్యాంగంలో ఆస్తిహక్కు ఉంది. కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో మాత్రం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఆస్తి హక్కు III వ భాగంలో ఆర్టికల్-31లో ఉండేది. దీని వల్ల అనేక సమస్యలు రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి XII వ భాగంలో ఆర్టికల్-300అలో చేర్చి సాధారణ హక్కుగా లేదా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు.
- సమాధానం: 4
3. భారత రాజ్యాంగంలో ‘రాజ్యం’ నిర్వచనం ఏ ఆర్టికల్‌లో ఉంది?
1) ఆర్టికల్-12
2) ఆర్టికల్-36
3) ఆర్టికల్-37
4) ఆర్టికల్-12, ఆర్టికల్-36
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలో ‘రాజ్యం’ నిర్వచనం ప్రాథమిక హక్కుల విభాగంలో ఆర్టికల్-12లో, ఆదేశిక సూత్రాల విభాగంలో ఆర్టికల్-36లో ఉంది. ఆర్టికల్-12 ప్రకారం ప్రాథమిక హక్కులను అమలు పరచేది రాజ్యమే. అదే విధంగా ఆర్టికల్-36 ప్రకారం రాజ్యానికి రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. వీటి ప్రకారం ‘రాజ్యం’ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ర్ట ప్రభుత్వం, రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్పోరేషన్లు మొదలైనవి వస్తాయి. న్యాయ శాఖ మాత్రం రాజ్యం పరిధిలోకి రాదు.
- సమాధానం: 4
Published date : 23 Dec 2021 01:11PM