భారతదేశంలో బలవంతపు మత మార్పిడులను నిషేధించిన తొలి రాష్ట్రం?
1. ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది?
1) అమెరికాలో ‘బిల్ ఆఫ్ రైట్’ చట్టం
2) ఫ్రెంచి విప్లవ సందర్భంలో ‘హక్కుల ప్రకటన
3) ఇంగ్లండ్‌లో ‘మాగ్నాకార్టా’ చట్టం
4) ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ‘మానవ హక్కుల ప్రకటన
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టంగా ‘మాగ్నాకార్టా’ను చెప్పవచ్చు. దీనిని 1215 సంవత్సరం జూన్ 15న ఇంగ్లండ్ రాజు కింగ్ జాన్ దీనిని ప్రకటిస్తూ ప్రజలకు స్వేచ్ఛ, హక్కులను కల్పించాడు. ‘మాగ్నా’ అంటే పెద్దది, ‘కార్టా’ అంటే ఒప్పందం అని అర్థం. 2015 జూన్ 15న దీనిని రూపొందించి 800 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంగ్లండ్‌లో ఉత్సవాలు జరిగాయి.
- సమాధానం: 3
2. ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
1) 1976
2) 1977
3) 1978
4) తొలగించలేదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి తొలగించలేదు. భారత రాజ్యాంగంలో ఆస్తిహక్కు ఉంది. కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో మాత్రం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఆస్తి హక్కు III వ భాగంలో ఆర్టికల్-31లో ఉండేది. దీని వల్ల అనేక సమస్యలు రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి XII వ భాగంలో ఆర్టికల్-300అలో చేర్చి సాధారణ హక్కుగా లేదా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు.
- సమాధానం: 4
3. భారత రాజ్యాంగంలో ‘రాజ్యం’ నిర్వచనం ఏ ఆర్టికల్‌లో ఉంది?
1) ఆర్టికల్-12
2) ఆర్టికల్-36
3) ఆర్టికల్-37
4) ఆర్టికల్-12, ఆర్టికల్-36
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలో ‘రాజ్యం’ నిర్వచనం ప్రాథమిక హక్కుల విభాగంలో ఆర్టికల్-12లో, ఆదేశిక సూత్రాల విభాగంలో ఆర్టికల్-36లో ఉంది. ఆర్టికల్-12 ప్రకారం ప్రాథమిక హక్కులను అమలు పరచేది రాజ్యమే. అదే విధంగా ఆర్టికల్-36 ప్రకారం రాజ్యానికి రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. వీటి ప్రకారం ‘రాజ్యం’ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ర్ట ప్రభుత్వం, రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్పోరేషన్లు మొదలైనవి వస్తాయి. న్యాయ శాఖ మాత్రం రాజ్యం పరిధిలోకి రాదు.
- సమాధానం: 4
4. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఎప్పుడూ రద్దు కాని ఆర్టికల్స్?
1) ఆర్టికల్-14, 15
2) ఆర్టికల్-20,21
3) ఆర్టికల్-21, 22
4) ఆర్టికల్-29,30
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా భారత రాష్ర్టపతి రద్దు చేస్తాడు. కానీ ఆర్టికల్ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మాత్రం రద్దు కావు. ఆర్టికల్-20 నేరం-శిక్ష నుంచి రక్షణను తెలుపగా, ఆర్టికల్-21 జీవించే స్వేచ్ఛను తెల్పుతుంది. అదే విధంగా ఆర్టికల్-19లో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛలు ‘యుద్ధం’, ‘విదేశీ దాడి’ సందర్భంలో మాత్రమే రద్దు చేయవచ్చు. కానీ ‘సాయుధ తిరగుబాటు’ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రం దీనిని రద్దుచేయలేం.
- సమాధానం: 2
5. భారత రాజ్యాంగంలో ఆరు రకాల స్వేచ్ఛలు ఏ ఆర్టికల్‌లో ఉన్నాయి?
1) ఆర్టికల్-19
2) ఆర్టికల్-20
3) ఆర్టికల్-21
4) ఆర్టికల్-22
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఆర్టికల్-19లో ఏడు రకాల స్వేచ్ఛలు ఉండేవి. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1978) ఆర్టికల్-19-1(f)లో ఉన్న ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛను తొలగించగా, ప్రస్తుతం ఆరు రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. అవి
1) వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ (ఆర్టికల్-19-1(a))
2) సమావేశం అయ్యే స్వేచ్ఛ (ఆర్టికల్-19-1(b))
3) సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ (ఆర్టికల్-19-1(c))
4) సంచార స్వేచ్ఛ(ఆర్టికల్-19-1(d))
5) స్థిర నివాస స్వేచ్ఛ (ఆర్టికల్-19-1(e))
6) వృత్తిపరమైన స్వేచ్ఛ (ఆర్టికల్-19-1(g))
- సమాధానం: 1
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పాఠశాల విద్య - ప్రాథమిక హక్కు
బి) విద్యా హక్కు - ఆదేశిక సూత్రం
సి) తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత - ప్రాథమిక విధి
డి) బాల బడి విద్య - ఆదేశిక సూత్రం
1) ఎ మాత్రమే సరైంది
2) ఎ, బి, సరైనవి
3) ఎ, సి, డి సరైనవి
4) పైవన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: 4
వివరణ: 6-14 సంవత్సరాల్లోపు బాల బాలికలకు పాఠశాల విద్యను కల్పించటం అనేది ఆర్టికల్-21A ద్వారా ప్రాథమిక హక్కుగా ఉంది. విద్యా హక్కు అనేది ఆర్టికల్-41లో ఆదేశిక సూత్రంగా ఉంది. 6-14 సంవత్సరాల్లోపు పిల్లలను పాఠశాలకు పంపడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని ఆర్టికల్-51-Aలో ప్రాథమిక విధిగా ఉంది. అదే విధంగా 6 సంవత్సరాల్లోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఆర్టికల్-45లో ఆదేశిక సూత్రంగా ఉంది.
- సమాధానం: 4
7. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్ట పరిహారం?
1) ఏ సందర్భంలోను చెల్లించనవసరం లేదు
2) అన్ని సందర్భాల్లోను చెల్లించాలి
3) రెండు సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి
4) పై వాటిలో ఏదీ సరికాదు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి సాధారణ హక్కు లేదా పౌర హక్కుగా మార్చిన తర్వాత నష్ట పరిహారం చెల్లింపు అనే అంశాన్ని సవరించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ఆస్తిని ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు. కానీ కింది రెండు సందర్భాల్లో మాత్రం తప్పకుండా చెల్లించాలి.
1) మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసిన ప్పుడు (ఆర్టికల్-30)
2) రైతు తన అవసరం కోసం వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా నష్ట పరిహారం చెల్లించాలి. (ఆర్టికల్-31-A)
- సమాధానం: 3
8. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీచేసే రిట్?
1) హేబియస్ కార్పస్
2) మాండమస్
3) కో-వారెంటో
4) ప్రొహిబిషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మాండమస్ అంటే ‘మేము ఆదేశిస్తున్నాం’ అని అర్థం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నిర్వహించనప్పుడు నిర్వర్తించమని ఆదేశించే కోర్టు ఆజ్ఞే ‘మాండమస్’ అంటారు. దీనిని ప్రభుత్వ అధికారులపై గాని, ప్రభుత్వ సంస్థలపైన గాని లేదా ప్రభుత్వ రంగ సంస్థలపై గాని జారీ చేయవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులపై, సంస్థలపై జారీచేయలేం.
- సమాధానం: 2
9. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ర్టపతి ఆర్టికల్-20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. ఈ సందర్భంలో వీటి రక్షణకై రిట్స్ జారీచేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) సుప్రీంకోర్టుకు మాత్రమే
2) హైకోర్టుకు మాత్రమే
3) సుప్రీంకోర్టు, హైకోర్టు
4) ఏ కోర్టుకు ఉండదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో ఆర్టికల్-352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను రాష్ర్టపతి ఆర్టికల్-359 ప్రకారం రద్దు చేస్తారు. కానీ ఆర్టికల్-20, 21 మాత్రం రద్దు కావు. ఈ సందర్భంలో ఈ ప్రాథమిక హక్కులకు (ఆర్టికల్-20, 21) భంగం కలిగితే రిట్స్ జారీచేసే అధికారం కేవలం హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు రిట్స్ జారీచేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్-32 కూడా రద్దవుతుంది. కానీ హైకోర్టుకు రిట్స్ జారీచేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్-226 ద్వారా హైకోర్టు రిట్స్ జారీ చేయవచ్చు.
- సమాధానం: 2
10. భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్‌లో ఉంది?
1) 13
2) 14
3) 15
4) 16
- View Answer
- సమాధానం: 2
వివరణ: చట్టం ముందు అందరూ సమానులే. చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది అనే భావనను సమన్యాయ పాలన అంటారు. దీని గురించి ఆర్టికల్-14లో ఉంది. దీనిని ఎ.వి. డైసీ తన ‘లా ఆఫ్ ది కాన్స్ట్యుషన్’ అనే గ్రంథంలో ముందుగా చెప్పాడు. దీనిని భారత రాజ్యాంగవేత్తలు ఇంగ్లండ్ నుంచి స్వీకరించారు.
- సమాధానం: 2
11. రాజ్యాంగంలోని ఆర్టికల్-16 (4A) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించారు?
1) ఎస్సీ, ఎస్టీలు
2) ఎస్సీ, ఎస్టీ, బీసీలు
3) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు
4) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్-16(4A)లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించారు. దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2002లో 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్-16(4A)ని మరింత బలోపేతం చేశారు.
- సమాధానం: 1
12. కింది వాటిలో ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా ఉన్నవి ఏవి?
ఎ) అంటరానితనం నిషేధం
బి) బిరుదులు, కీర్తి చిహ్నాలు నిషేధం
సి) బాల కార్మిక వ్యవస్థ నిషేధం
డి) వివక్షత నిషేధం
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, సి, డి సరైనవి
4) పైవన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్టికల్-17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్-18 బిరుదులు, కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది. ఆర్టికల్-15 కుల, మత, జాతి, ప్రాంత, లింగపరమైన వివక్షతలను నిషేధిస్తుంది, ఆర్టికల్-24 బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. అయితే ఆర్టికల్-15, 18లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
- సమాధానం: 4
13. భారతదేశంలో బలవంతపు మత మార్పిడిలను నిషేధించిన తొలి రాష్ర్టం?
1) ఛత్తీస్‌ఘడ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ ఒడిశా ప్రభుత్వం 1967లో చట్టం చేసింది. అనంతరం 1968లో మధ్యప్రదేశ్, 2000లో ఛత్తీస్గడ్, 2002లో తమిళనాడు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. వీటితో పాటు అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా నిషేధించారు.
- సమాధానం: 4
14. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జారీచేసే రిట్లు ఏవి?
1) హేబియస్ కార్పస్, ప్రొహిబిషన్
2) మాండమస్, సెర్షియోరి
3) ప్రొహిబిషన్, సెర్షియోరి
4) హేబియస్ కార్పస్, మాండమస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రొహిబిషన్, సెర్షియోరి రిట్లు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయాస్థానాలపై జారీచేసే రిట్లు. ఒక దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తున్నపుడు లేదా ఆ కేసు విచారణను ఎవరైనా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు దానిని నిలిపివేయమని ఉన్నత కోర్టు ఇచ్చే ఆదేశమే ప్రొహిబిషన్. సెర్షియోరి అంటే కింది కోర్టు విచారిస్తున్న కేసును పై కోర్టుకు గాని లేదా పక్క కోర్టులకు గాని బదిలీ చేయమని పై కోర్టు ఇచ్చే ఆదేశం.
- సమాధానం: 3
15. కామేశ్వరి సింగ్ Vs బిహార్ కేసు (1950) దేనికి సంబంధించింది?
1) జీవించే స్వేచ్ఛ
2) భూ సంస్కరణలు
3) రిజర్వేషన్లు
4) వ్యక్తిగత గోప్యత
- View Answer
- సమాధానం: 2
వివరణ: బిహార్ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దుచేసి భూసంస్కరణలు ప్రవేశపెట్టడాన్ని కామేశ్వరి సింగ్ కోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యతనిస్తూ బిహార్ భూ సంస్కరణల చట్టాన్ని కొట్టివేసింది. ఇది ఆర్టికల్-31లో పేర్కొన్న ఆస్తిహక్కుకు విరుద్ధమని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించటానికి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా (1951) 9వ షెడ్యూల్లో భూసంస్కరణలను చేర్చారు.
- సమాధానం: 2
16. కింది వాటిలో ప్రాథమిక హక్కులను రక్షించేది?
1) రాష్ర్టపతి
2) భారత పార్లమెంట్
3) సుప్రీంకోర్టు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: III వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టు వివిధ రకాల రిట్లను జారీచేసి రక్షిస్తుంది. భారత పార్లమెంట్ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రాథమిక హక్కులను సవరిస్తుంది. భారత రాష్ర్టపతి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దుచేస్తాడు.
- సమాధానం: 3
17. భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపం’ అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది?
1) సజ్జన్ సింగ్ కేసు (1965)
2) గోలక్‌నాథ్ కేసు (1967)
3) కేశవానంద భార తీ కేసు (1973)
4) మేనకా గాంధీ కేసు (1978)
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేశవానంద భారతి కేసులో (1973) సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. కానీ ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని’ మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పింది.
- సమాధానం: 3
18. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నారు?
1) 14
2) 21
3) 30
4) 32
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్టికల్-32లో రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంది. దీనిని ప్రాథమిక హక్కులకు ‘కంచె’గా చెబుతారు. రాజ్యాంగ పరిహారపు హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేడ్కర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగిస్తూ ‘భారత రాజ్యాంగంలో అన్నింటి కంటే మఖ్యమైంది ఆర్టికల్-32. ఈ ఆర్టికల్ లేకుంటే భారత రాజ్యాంగమే విలువను కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
- సమాధానం: 4