ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1. భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు?
1) మోతీలాల్ నెహ్రూ నివేదిక
2) జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల, ఆశయాల తీర్మానం
3) రాజాజీ ఫార్ములా
4) లార్డ్ వేవెల్ ప్లాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది. దీనినే ‘పీఠిక ’ లేదా ‘అవతారిక’ అని కూడా అంటారు. జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన ‘లక్ష్యాల ఆశయాల తీర్మానం’ ప్రవేశికకు ఆధారం. దీనిని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఆమోదించింది. దీని ప్రకారం ప్రవేశికను రూపొందించగా, ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని రూపొందించారు.
- సమాధానం: 2
2. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం?
1) భారతదేశంలో అధికారానికి మూలం
2) ప్రభుత్వం స్వరూపం
3) రాజకీయ వ్యవస్థ లక్ష్యం
4) రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాజ్యాంగ ప్రవేశికలో పై మూడు అంశాలు ఉన్నాయి. నాలుగో అంశం లేదు. అవి భారతదేశంలో అధికారానికి మూలం–ప్రజలు: ప్రభుత్వం స్వరూపం – సర్వస త్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర: రాజకీయ వ్యవస్థ లక్ష్యం– న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత, సౌభ్రాతృత్వం అంశాలు ఉన్నాయి. అదే విధంగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది ప్రవేశికలో లేదు. కానీ రాజ్యాంగం ఆమోదించిన తేది ఉంది.(1949 నవంబర్ 26)
- సమాధానం: 4
3. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) బెరుబరి కేసు (1960)
2) కేశవానంద భారతీ కేసు (1973)
3) మినర్వా మిల్స్ కేసు (1980)
4) ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు (1995)
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా! కాదా! అనే చర్చ రాజ్యాంగ తయారీ నుంచి ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా తీర్పు చెప్పింది. అవి 1960 బెరుబరి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్, ఏ షెడ్యూల్, ఏ భాగంలో కూడా ప్రవేశిక గురించి లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాని కేశవానంద భారతీ, మినర్వామిల్స్, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులలో మాత్రం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పు చెప్పింది.
- సమాధానం: 1
4. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
1) 104 సార్లు
2) ఒకసారి
3) రెండుసార్లు
4) సవరించలేదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఒకే ఒMýసారి సవరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి ‘సామ్యవాద’ ‘లౌకిక’ ‘సమగ్రత’ అనే పదాలను చేర్చారు.
- సమాధానం: 2
5. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభమవుతుంది.
1) భారత పౌరులమైన మేము
2) ఈ దేశ పౌరులమైన మేము
3) భారత ప్రజలమైన మేము
4) ఈ దేశ ప్రజలమైన మేము
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజ్యాంగ ప్రవేశిక ‘‘భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నెలకొల్పడానికి దృఢ నిశ్చయులై ఉండి పౌరులందరికీ....’’ అని ప్రారంభమవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికీ ‘కీ–నోట్’ వంటిదని ఎర్నేస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. దీనిని భారత ‘జాతి జాతక చక్రం’ అని కె.ఎం. మున్షి వ్యాఖ్యానించారుత.
- సమాధానం: 3
6. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి?
1) 08
2) 10
3) 11
4) లేవు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. వీటి గురించి రాజ్యాంగ పరిషత్లో చర్చ వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యులు రాజ్యాంగంలో వీటిని చేర్చడం భారత పౌరులను అవమానించటమే అని వీటిని విస్మరించారు.
- సమాధానం: 4
7. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి?
1) 42, 44
2) 42, 86
3) 44, 86
4) 44, 84
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా 10 ప్రాథమిక విధులను 4–ఏ భాగంలో, 51–ఏ ఆర్టికల్లో పొందుపరిచారు. అనంతరం వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా మరో విధిని చేర్చటంతో వీటి సంఖ్య 11కు పెరిగింది.
- సమాధానం: 2
8. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2002) కింది వాటిలో వేటిని సవరించారు?
1) ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు
2) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు
4) ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా పై మూడు అంశాలను కింది విధంగా సవరించారు. ఆర్టికల్ 21–ఏ లో 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించటం ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కుగా చేశారు. ఆర్టికల్ 45లో 6 ఏళ్లలోపు పిల్లలకు బాలబడి విద్య అందించటం రాజ్యానికిచ్చిన ఆదేశిక సూత్రంగా పొందుపర్చారు. ఆర్టికల్ 51ఏలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను పాఠశాలకు పంపడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక విధిగా చేశారు.
- సమాధానం: 4
9. ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) జనవరి 3
2) జనవరి 10
3) డిసెంబర్ 3
4) డిసెంబర్ 10
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రాథమిక విధులను రాజ్యాంగంలో 1976లో చేర్చినప్పటికీ అవి 1977 జనవరి 3 నుంచి అమలులోకి వచ్చాయి. దీనిని పురస్కరించుకుని జనవరి 3ను ప్రాథమిక విధుల అమలు దినోత్సవంగా జరుపుకుంటారు.
- సమాధానం: 1
10. ప్రాథమిక విధుల సక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వటానికి నియమించిన కమిటీ ఏది?
1) ఎంపీ శర్మ
2) జేఎస్ వర్మ
3) ఎం.ఎన్. వెంకటాచలయ్య
4) స్వరణ్ సింగ్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రాథమిక విధుల సక్రమ అమలుకై సూచనలు చేయటానికి జేఎస్ వర్మ కమిటీని (1998–99) నియమిస్తే ఇది పలు సూచనలు చేసింది.
–ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల అమలు దినోత్సవంగా జరుపుకోవాలి: సమాచార సాధనాల ద్వారా వీటి పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి: అన్ని విద్యా సంస్థల్లో ఎన్సీసీని ప్రవేశపెట్టాలి.
- సమాధానం: 2
11. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి?
1) 35 నుంచి 51 వరకు
2) 35 నుంచి 50 వరకు
3) 36 నుంచి 51 వరకు
4) 36 నుచి 50 వరకు
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆ§óశాలే ఆదేశిక సూ త్రాలు. వీటిని రాజ్యాంగంలో నాల్గో భాగంలో 36 నుంచి 51 ఆర్టికల్లో పొందుపర్చారు. వీటి లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన.
- సమాధానం: 3
12. భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1) 3
2) 5
3) 7
4) ఎలాంటి వర్గీకరణ లేదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి వర్గీకరణ లేదు. వీటిని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పొందుపర్చారు. కాని ఎంపీ శర్మ అనే పాలనావేత్త వీటి స్వభావాన్ని బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
ఎ) సామ్యవాద సూత్రాలు
బి) గాంధేయ వాద సూత్రాలు
సి) ఉదార ప్రజాస్వామ్య సూత్రాలు.
- సమాధానం: 4
13. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) స్పెయిన్
2) ఐర్లాండ్
3) ఫ్రాన్స్
4) సోవియట్ రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆదేశిక సూత్రాలను 1937లో రూపొందించిన ఐర్లాండ్∙రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఐర్లాండ్∙రాజ్యాంగంలో వీటిని ‘సామాజిక విధాన ఆదేశిక సూత్రాలు’ అంటే భారత రాజ్యాంగంలో వీటిని ‘రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు’ అని సంబోధించారు. భారతదేశం వీటిని ఐర్లాండ్ నుంచి స్వీకరించగా, ఐర్లాండ్∙దేశం స్పెయిన్ నుంచి స్వీకరించింది.
- సమాధానం: 2
14. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిదేది?
1) మద్యపాన నిషేధం
2) గోవధ నిషేధం
3) పని హక్కు
4) ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: పై వాటిలో ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ అనేది ప్రాథమిక విధులలో అంతర్భాగం. మిగిలిన మూడు ఆదేశిక సూత్రాలే. ఆర్టికల్–47 మద్యపాన నిషేధం గురించి తెల్పుతుంది. ఆర్టికల్–48 గోవధను నిషేధిస్తుంది. అదే విధంగా ఆర్టికల్–41లో పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కు గురించి తెల్పుతుంది. మద్యపానాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం గుజరాత్. గోవధను నిషేధించిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
- సమాధానం: 4
15. ఆదేశిక సూత్రాలను ‘బ్యాంక్ వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని’ వ్యాఖ్యానించింది ఎవరు?
1) ఎం.సి. చాగ్లా
2) బీఆర్ అంబేడ్కర్
3) కేటీ షా
4) కేసీ వేర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యస్థాపనను కాంక్షించినప్పటికీ ఇవి న్యాయ సమ్మతం కావు. అంటే వీటి అమలు తప్పనిసరి కాదు. అది కేవలం ప్రభుత్వం వద్ద ఉన్న వనరుల మేరకే అమలు చేస్తుంది. అందుకే కేటీ షా వీటిని బ్యాంక్ వసతి ప్రకారం చెల్లించే చెక్కువంటిదని వ్యాఖ్యానించారు. ఎం.సి. చాగ్లా ఆదేశిక సూత్రాలు అమలుపరిస్తే భారత్ భూతల స్వర్గం అవుతుందని వ్యాఖ్యానించగా, బీఆర్ అంబేడ్కర్ ప్రకారం ఆదేశిక సూత్రాలు సామాజిక విప్లవాన్ని సాధిస్తాయని అంటే, కేసీ వేర్ ఆదేశిక సూత్రాలను లక్ష్యాలు, ఆశయాల మ్యానిఫెస్టోగా పేర్కొన్నారు.
- సమాధానం: 3
16. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలు అని కింది వాటిలో తెలిపేది ఏది?
1) చంపకం దొరై రాజన్ కేసు
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
3) కేశవానంద భారతి కేసు
4) పైవన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు (1973)లో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలుగా పేర్కొన్నది. ఆదేశిక సూత్రాలు ఆశయాలను తెలిపితే, ప్రాథమిక హక్కులు వాటిని సాధించడానికి సాధనాలను సూచిస్తున్నాయి.
శాసన, కార్యనిర్వాహాక శాఖలు ముందు నుంచి ఆదేశిక సూత్రాలకు ప్రాముఖ్యతనిస్తే, న్యాయ శాఖ ప్రాథమిక హక్కులకు ప్రాముఖ్యత ఇచ్చింది. చంపకం దొరై రాజన్ కేసులో (1951) ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంట్ 25వ రాజ్యాంగ సవరణ (1971) ద్వారా ప్రాథమిక హక్కులు కంటే ఆదేశిక సూత్రాలే ఉన్నతమైనవిగా రాజ్యాంగాన్ని సవరించింది.
- సమాధానం: 3
17. ఇప్పటి వరకు అమలు పరచని ఆదేశిక సూత్రం ఏది?
1) ఉమ్మడి పౌర స్మృతి
2) సంక్షేమ సూత్రాల అమలు
3) ప్రజారోగ్యాన్ని కాపాడటం
4) పేదలకు ఉచిత న్యాయ సహాయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతం కావు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలలో కొన్నింటిని పాక్షికంగా, కొన్నింటిని పూర్తిగా అమలు చేశాయి. కాని ఇప్పటి వరకు అమలు పరచని ఏకైక ఆదేశిక సూత్రం ఆర్టికల్ –44లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి.
సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు పరచమని కేంద్రాన్ని కోరింది. కానీ ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి కేంద్రం చేయలేకపోతుంది. భారతదేశంలో భిన్న మతాలు ఉండి ఆయా మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉండటం వల్ల అనేక సందర్భాల్లో సమస్యల పరిష్కారం క్లిష్టం అవుతుంది. అందుకే జాతీయ సమైఖ్యతకై ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది.
- సమాధానం: 1
18. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్–39(ఎ), 39(డి), 39(ఎఫ్), 43(ఎ), 48(ఎ)లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 24
2) 25
3) 42
4) 44
- View Answer
- సమాధానం: 3
వివరణ: 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ఆదేశిక సూత్రాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చారు. అవి ఆర్టికల్ 39(ఎ)లో పేదలకు ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 39(డి)లో ్రïస్తీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం, 39(ఎఫ్)లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం, 43(ఎ)లో పరిశ్రమల్లో కార్మికుల్ని భాగస్వామ్యం, 48(ఎ)లో పర్యావరణ పరిరక్షణ అంశాలను చేర్చారు.
- సమాధానం: 3
19. ‘‘భవిష్యత్లో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) నెహ్రూ
2) అంబేడ్కర్
3) రాజేంద్ర ప్రసాద్
4) బీఎన్ రాయ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆదేశిక సూత్రాలపై రాజ్యాంగ పరిషత్లో చర్చ సందర్భంగా అంబేడ్కర్ ఈ వ్యాఖ్య చేశారు. ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతం కావు. వీటి అమలు తప్పనిసరి కాదు. కానీ అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది వీటి అమలుపై ఆధారపడి ఉంటుందని, ఇవి భావి శాసనాలకు మార్గదర్శకాలుగా ఉంటాయని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు.
- సమాధానం: 2