యాంత్రిక శాస్త్రం - 2
1. కింద పేర్కొన్న ఏ సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది?
ఎ) శక్తి నిత్యత్వ నియమం
బి) బెర్నౌలీ నియమం
సి) అవగాడ్రో సిద్ధాంతం
డి) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
- View Answer
- సమాధానం: డి
2. గుర్రపుస్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణమేమిటి?
ఎ) జడత్వ భ్రామకం
బి) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
సి) నిశ్చల జడత్వం
డి) న్యూటన్ మూడో గమన నియమం
- View Answer
- సమాధానం: సి
3. క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనుకకు లాగుతాడు. ఎందుకంటే ..
ఎ) బంతి నిశ్చల స్థితికి వస్తుంది
బి) బంతి త్వరణం చెందుతుంది
సి) బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది
డి) బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది
- View Answer
- సమాధానం: సి
4. మీగడను వేరుచేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది?
ఎ) అపకేంద్ర బలం
బి) అభికేంద్ర బలం
సి) కేంద్రక బలం కానిది
డి) బాహ్య బలం
- View Answer
- సమాధానం: ఎ
5. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై పనిచేసే బలం కింది ఏ సందర్భంలో ఎక్కువ?
ఎ) లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు
బి) లిఫ్ట్ త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు
సి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు
డి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నప్పుడు
- View Answer
- సమాధానం: బి
6. లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి దృశ్య భారం నిజ భారం కంటే ఏ సందర్భంలో తక్కువ?
ఎ) లిఫ్ట్ త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు
బి) లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు
సి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నప్పుడు
డి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు
- View Answer
- సమాధానం: బి
7. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడటానికి కారణమేమిటి?
ఎ) అపకేంద్ర బలం
బి) గురుత్వ బలం
సి) ఘర్షణ బలం
డి) అయస్కాంత బలం
- View Answer
- సమాధానం: ఎ
8.బస్సు మలుపు తిరిగేటప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ఒక వైపు వంగుతాడు. దీనికి కారణం ఏమిటి?
ఎ) గమన జడత్వం
బి) దిశా జడత్వం
సి) వేగ జడత్వం
డి) స్థిర జడత్వం
- View Answer
- సమాధానం: బి
9. కింది వాటిలో అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసేది ఏది?
ఎ) కప్పీ
బి) వాషింగ్ మెషిన్
సి) స్క్రూడ్రైవర్
డి) సామాన్యలోలకం
- View Answer
- సమాధానం: బి
10.ధనస్సులో సంధించిన బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
ఎ) గతిజ శక్తి
బి) స్థితిజ శక్తి
సి) ఘర్షణ శక్తి
డి) గురుత్వ శక్తి
- View Answer
- సమాధానం: బి
11. విరామంలో ఉన్న వస్తువు కింది వాటిలో దేన్ని కలిగి ఉంటుంది?
ఎ) జడత్వం
బి) బలం
సి) వేగం
డి) ద్రవ్యవేగం
- View Answer
- సమాధానం: ఎ
12. గాలిలో ప్రయాణిస్తున్న విమానానికి ఉండే శక్తి ఏది?
ఎ) స్థితిజ శక్తి
బి) గతిజ శక్తి
సి) ఎ, బి
డి) ఏ శక్తి ఉండదు
- View Answer
- సమాధానం: సి
13. పడవపై నుంచి ఒక వ్యక్తి ఒడ్డు పైకి దూకినప్పుడు పడవ వెనక్కి జరుగుతుంది. దీన్ని ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు?
ఎ) న్యూటన్ మొదటి గమన నియమం
బి) న్యూటన్ రెండో గమన నియమం
సి) న్యూటన్ మూడో గమన నియమం
డి) న్యూటన్ గురుత్వాకర్షణ నియమం
- View Answer
- సమాధానం: సి
14. ఒక వస్తువు భారం విషయంలో కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భూతలంపై ఎక్కడైనా సమానం
బి) ధ్రువాల వద్ద గరిష్టం
సి) భూమధ్యరేఖ వద్ద గరిష్టం
డి) చదునైన భూమిపై కంటే గుట్టలపై ఎక్కువ
- View Answer
- సమాధానం: బి
15. ఒక వస్తువును భూమిపై నుంచి చంద్రుడి పైకి తీసుకువెళితే ..?
ఎ) దాని ద్రవ్యరాశి మారుతుంది, భారం స్థిరంగా ఉంటుంది
బి) ద్రవ్యరాశి, భారం.. రెండూ మార్పు చెందుతాయి
సి) ద్రవ్యరాశి స్థిరం, భారం మార్పు చెందుతుంది
డి) ద్రవ్యరాశి, భారం రెండూ స్థిరంగా ఉంటాయి
- View Answer
- సమాధానం: సి
16. గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు?
ఎ) జాన్ డాల్టన్
బి) న్యూటన్
సి) ఫారడే
డి) ఐన్‌స్టీన్
- View Answer
- సమాధానం: బి
17. న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాల్లో దేనికి అధిక ప్రాధాన్యం ఉంది?
ఎ) మొదటి నియమం
బి) రెండో నియమం
సి) మూడో నియమం
డి) అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఉంది
- View Answer
- సమాధానం: బి
18. కింది వారిలో యాంత్రిక శాస్త్ర పరిశోధనలతో సంబంధం లేని శాస్త్రవేత్త?
ఎ) న్యూటన్
బి) గెలీలియో
సి) అరిస్టాటిల్
డి) మేడమ్ క్యూరీ
- View Answer
- సమాధానం: డి
19. కొండను ఎక్కుతున్న వ్యక్తి ముందుకు వంగుతాడు. కారణమేమిటి?
ఎ) పడిపోకుండా ఉండటానికి
బి) వేగం పెంచుకోవడానికి
సి) అలసటను తగ్గించడానికి
డి) స్థిరత్వం పెంచడానికి
20. రాకెట్, జెట్ విమానాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న న్యూటన్ గమన నియమం ఏది?
ఎ) మొదటి నియమం
బి) రెండో నియమం
సి) మూడో నియమం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
21.వస్తువు ఏ భౌతిక రాశిపై జడత్వం ఆధారపడి ఉంటుంది?
ఎ) ద్రవ్యరాశి
బి) ఆకారం
సి) రంగు
డి) వైశాల్యం
- View Answer
- సమాధానం:ఎ
22. ప్రచోదనానికి ప్రమాణం?
ఎ) న్యూటన్-మీటర్
బి) న్యూటన్-సెకన్
సి) న్యూటన్/మీటర్
డి) న్యూటన్/సెకన్
- View Answer
- సమాధానం: బి
23. 60 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వ్యక్తి లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ తీగలు తెగితే వ్యక్తి భారం-
ఎ) 60 కిలోలు
బి) 0 కిలోలు
సి) 680 కిలోలు
డి) 609.0 కిలోలు
- View Answer
- సమాధానం: బి
24. కొబ్బరి చెట్టుపై ఉన్న కోతికి తుపాకీతో గురిపెట్టి ట్రిగ్గరు నొక్కే సమయంలో.. ఆ కోతి కిందకు జారడం ప్రారంభిస్తే బుల్లెట్ -
ఎ) కోతిని తాకుతుంది
బి) కోతి పైభాగం నుంచి తాకకుండా వెళుతుంది
సి) కోతి కింది భాగం నుంచి తాకకుండా వెళుతుంది
డి) చెప్పలేం
- View Answer
- సమాధానం: ఎ
25.వంపు మార్గంలో వాహనం సురక్షితంగా ప్రయాణించాలంటే దాని గరిమనాభి స్థానం ఏ భాగంలో ఉండాలి?
ఎ) పైన
బి) మధ్య
సి) కింద
డి) వెనక
- View Answer
- సమాధానం: సి
26. అంతర్గత బలాల మధ్య మార్పు దేనిలో కలుగుతుంది?
ఎ) బాంబు విస్ఫోటం
బి) వాహన గమనం
సి) గ్రహాల చలనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
27. బలానికి అంతర్జాతీయ ప్రమాణం ఏది?
ఎ) జౌల్
బి) ఎర్గ్
సి) ఆంపియర్
డి) న్యూటన్
- View Answer
- సమాధానం: డి
28. పరావలయ మార్గంలో ప్రయాణిస్తున్న బాంబు మార్గమధ్యంలో విస్ఫోటం చెందితే దాని ద్రవ్యరాశి కేంద్రం ప్రయాణించే మార్గం -
ఎ) వక్ర మార్గం
బి) రుజు మార్గం
సి) పరావలయ మార్గం
డి) దీర్ఘవృత్తాకార మార్గం
- View Answer
- సమాధానం: సి
29. భ్రమణ చలనంలో ఉన్న వస్తువుకు ఉండే నిజమైన బలం -
ఎ) అభికేంద్ర బలం
బి) అపకేంద్ర బలం
సి) విరూపకార బలం
డి) బాహ్య బలం
- View Answer
- సమాధానం: ఎ
30. భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం నియంత్రణ కోల్పోయినప్పుడు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
ఎ) వృత్తాకార మార్గానికి కోణీయంగా అవతలి వైపు
బి) వృత్తాకార మార్గానికి లంబంగా
సి) వృత్తాకార మార్గానికి సమాంతరంగా
డి) వృత్తాకార మార్గానికి 60ని కోణీయంగా అవతలి వైపు
- View Answer
- సమాధానం: ఎ
31. వంపు మార్గంపై ప్రయాణిస్తున్న వాహనానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎక్కడి నుంచి లభిస్తుంది?
ఎ) ఇంజన్
బి) బ్రేకులు
సి) చక్రాలు, రోడ్డు ఉపరితలానికి మధ్య ఉండే ఘర్షణ బలాల వల్ల
డి) స్టీరింగ్
- View Answer
- సమాధానం:సి
32. వాషింగ్ మెషిన్ పనిచేయడంలో ఉండే బలం ఏది?
ఎ) అపకేంద్ర బలం
బి) అభికేంద్ర బలం
సి) ఘర్షణ బలం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
33. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎక్కడి నుంచి లభిస్తుంది?
ఎ) సౌరపలకలు
బి) భూమి
సి) సూర్యుడు
డి) భూమి, కృత్రిమ ఉపగ్రహం మధ్య ఉండే విశ్వగురుత్వాకర్షణ బలం
- View Answer
- సమాధానం: డి
34. నిలువు వృత్తంలో చలిస్తున్న జెట్ విమాన వేగం వృత్తం ఏ స్థానం వద్ద గరిష్టంగా ఉంటుంది?
ఎ) ఉన్నతం
బి) నిమ్నతం
సి) వృత్త కేంద్రం
డి) వేగం అన్ని స్థానాల్లో సమానం
- View Answer
- సమాధానం: బి
35.భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి చేసిన రంధ్రంలో జారవిడిచిన వస్తువు ఎక్కడికి చేరుతుంది?
ఎ) ఉత్తర ధ్రువం
బి) దక్షిణ ధ్రువం
సి) భూ కేంద్రం
డి) రెండు ధ్రువాల మధ్య సరళ హరాత్మక చలనం చేస్తుంది
- View Answer
- సమాధానం:డి
36. గమనంలో ఉన్న వాహన చక్రాల చలనం?
ఎ) సరళ హరాత్మక
బి) రేఖీయ
సి) భ్రమణ
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
37. పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం?
ఎ) రేఖీయ
బి) కోణీయ
సి) సరళ హరాత్మక
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
38. ఉపగ్రహం తక్కువ వ్యాసార్ధం ఉన్న కక్ష్యలో నుంచి ఎక్కువ వ్యాసార్ధం ఉన్న కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు దాని రేఖీయ వేగం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) శూన్యం
- View Answer
- సమాధానం: బి
39. కింది వాటిలో శక్తికి ప్రమాణం ఏది?
ఎ) ఎర్గ్
బి) జౌల్
సి) ఎలక్ట్రాన్-ఓల్ట్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. కదులుతున్న రైలులో ప్రయాణికుడి శక్తి -
ఎ) గతిజ శక్తి
బి) స్థితిజ శక్తి
సి) యాంత్రిక శక్తి
డి) ఉష్ణ శక్తి
- View Answer
- సమాధానం: సి
41. రిజర్వాయర్‌లోని నీటికి ఉండే శక్తి ఏమిటి?
ఎ) గతిజ శక్తి
బి) స్థితిజ శక్తి
సి) యాంత్రిక శక్తి
డి) రసాయన శక్తి
- View Answer
- సమాధానం: బి
42. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది?
ఎ) ట్రాన్స్ ఫార్మర్
బి) బ్యాటరీ
సి) సైకిల్ డైనమో
డి) విద్యుత్ మోటారు
- View Answer
- సమాధానం: సి
43. కదులుతున్న రైలు నుంచి ఒక వస్తువును బయటకు జారవిడిచినప్పుడు అది ప్రయాణించే మార్గం -
ఎ) సరళ రేఖ
బి) వృత్తాకారం
సి) దీర్ఘవృత్తాకారం
డి) పరావలయం
- View Answer
- సమాధానం:డి
44. విద్యుత్‌తో పనిచేసే యంత్ర సామర్థ్యానికి కొలమానం -
ఎ) ఎర్గ్
బి) వాట్
సి) కెలోరీ
డి) ఆంపియర్
- View Answer
- సమాధానం: బి
45. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలకు ఉండే శక్తి -
ఎ) గతిజ శక్తి
బి) భ్రమణ శక్తి
సి) స్థితిజ శక్తి
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
46. గుర్రాలు బండిని లాగుతున్నప్పుడు శక్తి రూపాంతరం -
ఎ) కండర శక్తి గతిజ శక్తిగా మారుతుంది
బి) గతిజ శక్తి కండర శక్తిగా మారుతుంది
సి) కండర శక్తి స్థితిజ శక్తిగా మారుతుంది
డి) స్థితిజ శక్తి గతిజ శక్తిగా మారుతుంది
- View Answer
- సమాధానం: ఎ
47. కింది దిశలో కదులుతున్న లిఫ్ట్‌లో ఉన్న ఒక వ్యక్తి తన చేతిలోని బంతిని జారవిడిస్తే.. అది -
ఎ) కిందికి పడుతుంది
బి) పైకి కదులుతుంది
సి) లిఫ్ట్ మధ్య బిందువు వద్ద ఆగుతుంది
డి) సరళ హరాత్మకంగా చలిస్తుంది
- View Answer
- సమాధానం:ఎ
48. లిఫ్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్త -
ఎ) జాన్సన్
బి) ఓటీస్
సి) న్యూటన్
డి) ఫారడే
- View Answer
- సమాధానం: బి
49. పై దిశలో కదులుతున్న లిఫ్ట్‌లో వేలాడదీసిన లఘులోలకం ఆవర్తన కాలం -
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) శూన్యం
- View Answer
- సమాధానం: బి
50. ఒక వ్యక్తి భూమిపై మీటరు ఎత్తుకు ఎగరగలడు. అదే వ్యక్తి చంద్రునిపై ఎగరగలిగే ఎత్తు ఎంత?
ఎ) 1 మీ.
బి) మీ.
సి) 6 మీ.
డి) 10 మీ.
- View Answer
- సమాధానం: సి