విద్యుత్ - 2
1. జతపరచండి.
i. కెపాసిటర్ | 1. ఫారడే |
ii. విద్యుచ్ఛాలక బలం | 2. వోల్ట్ |
iii. విద్యుత్ వాహకత | 3. సీమెన్ |
iv. విశిష్ట నిరోధం | 4. ఓమ్-మీటర్ |
i | ii | iii | iv | |
ఎ) | 4 | 3 | 1 | 2 |
బి) | 2 | 1 | 4 | 3 |
సి) | 1 | 2 | 3 | 4 |
డి) | 2 | 4 | 1 | 3 |
- View Answer
- సమాధానం: సి
2. కింది వాటిలో ఒక హార్స్ పవర్(హెచ్‌పీ) ఎన్ని వాట్లకు సమానం?
ఎ) 647
బి) 764
సి) 746
డి) 847
- View Answer
- సమాధానం: సి
3.ఎ.సి. కరెంటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?
1. ఇది ద్విమార్గ కరెంట్
2. ఎ.సి. వోల్టేజిని ట్రాన్స్ ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు
3. ఈ కరెంటును పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టం
4. ఈ కరెంటును ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు
ఎ) 1, 2 మాత్రమే
బి) 2, 4మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
4. జతపరచండి.
i. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని | 1. ఆవేశం నిల్వకు |
ii. ఎలక్ట్రోఫోర్స్ | 2. అధిక శక్మభేదం ఉత్పిత్తికి |
iii. జనరేటర్ | 3. అధిక ఆవేశ ఉత్పత్తికి |
iv. కెపాసిటర్ | 4. విద్యుత్ ఆవేశ గుర్తింపునకు |
i | ii | iii | iv | |
ఎ) | 4 | 2 | 3 | 1 |
బి) | 1 | 3 | 2 | 4 |
సి) | 2 | 4 | 1 | 3 |
డి) | 4 | 3 | 1 | 2 |
- View Answer
- సమాధానం: ఎ
5. ‘నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు’ కింది వాటిలో సరైంది?
1. కరెంట్‌లో మార్పు ఉండదు
2. నిరోధం పెరుగుతుంది
3. విద్యుత్ శక్మభేదంలో మార్పు ఉండదు
4. ఫలిత నిరోధం కనిష్టం
ఎ) 2 మాత్రమే
బి) 1, 2 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
6. జతపరచండి.
1. విద్యుత్ శక్మభేదాన్ని కొలిచేది ii. అమ్మీటర్ 2. విద్యుత్‌ను కొలిచేది iii. గాల్వానో మీటర్ 3. emfను కొలిచేది iv.పొటెన్షియో మీటర్ 4. విద్యుత్ ప్రవాహదిశను కనుగొనేది
i | ii | iii | iv | |
ఎ) | 1 | 2 | 3 | 4 |
బి) | 4 | 3 | 1 | 2 |
సి) | 1 | 2 | 4 | 3 |
డి) | 3 | 4 | 2 | 1 |
- View Answer
- సమాధానం: సి
7.ఫ్యూజ్ వైరును వేటితో తయారు చేస్తారు?
ఎ) లెడ్, టిన్
బి) జింక్, లెడ్
సి) బిస్మత్, జింక్
డి) కాపర్, బిస్మత్
- View Answer
- సమాధానం: ఎ
8. ఫ్లోరోసెంట్ లాంప్ లోపలి తలానికి ఫ్లోరోసెంట్ పూత పూయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
ఎ)అతినీలలోహిత కాంతి దృశ్యమానకాంతిగా మారుతుంది
బి) ఉద్ఘారించిన ఎలక్ట్రాన్లు పాదరస అణువులతో తాడనం చెందడానికి సహాయపడుతుంది
సి) ఎలక్ట్రోడ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అన్నివైపులా విస్తరించడానికి దోహదపడుతుంది
డి) అధిక విద్యుత్ నుంచి గాజును రక్షించడానికి ఉపయోగపడుతుంది
- View Answer
- సమాధానం: బి
9. వాతావరణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్లైట్లను వాడతారు?
ఎ) పాదరస ఆవిరి దీపాలు
బి) నియాన్ దీపాలు
సి) సోడియం ఆవిరి దీపాలు
డి) ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు
- View Answer
- సమాధానం: డి
10. జతపరచండి.
i. విద్యుత్ బంధకాలు 1. వెండి, రాగి, పాదరసం ii. అర్ధ వాహకాలు 2. PVC, శుద్ధనీరు, వజ్రం iii. విద్యుత్ వాహకాలు 3. సిలికాన్, సెలోనియం, జెర్మేనియం
i | ii | iii | |
ఎ) | 1 | 2 | 3 |
బి) | 3 | 2 | 1 |
సి) | 2 | 3 | 1 |
- View Answer
- సమాధానం: సి
11. కింది వాటిలో గ్రాఫైట్‌కు సంబంధించి సరైంది ఏది?
1. ఇది ఒక కార్బన్ రూపాంతరం
2. గ్రాఫైట్‌ను నీటిలో కలిపితే ‘ఎల్లో కేక్’ అంటారు.
3. దీన్ని అణు రియాక్టర్లో మితకారిగా వాడతారు
4. దీన్ని పెన్సిల్ లెడ్‌లో వాడి, బ్లాక్లెడ్గా పిలుస్తారు
ఎ) 1 మాత్రమే
బి) 1, 3 మాత్రమే
సి) 1, 3, 4 మాత్రమే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
12. కింది వాటిలో సరైంది.
1. లెంజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ‘పరస్పర/అన్యోన్య ప్రేరణ’ సూత్రం ఆధారంగా ట్రాన్స్ ఫార్మర్ పనిచేస్తుంది.
2. ట్రాన్స్ ఫార్మర్ ద్వారా ఎ.సి. కరెంట్‌ను సరఫరా చేసినప్పుడు ప్రసార నష్టం తక్కువ.
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) రెండూ తప్పు
సి) రెండూ సరైనవే
డి) 1 తప్పు, 2 సరైంది
- View Answer
- సమాధానం: సి
13. రెండు వైర్లు ఒకే పదార్థంతో తయారై, ఒకే పొడవుతో ఉన్నాయి. కానీ మొదటి వైర్ వ్యాసం రెండో దాని కంటే రెండు రెట్లు ఎక్కువ. అయితే వాటి నిరోధం నిష్పత్తి ఎంత?
ఎ) 4 : 1
బి) 1 : 2
సి) 2 : 1
డి) 1 : 4
- View Answer
- సమాధానం: డి
14. షార్ట్ సర్య్కూట్ అంటే..
ఎ) శక్మభేదం ఉన్న రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ సరఫరా
బి) ఒకే శక్మంభేదం ఉన్న రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ సరఫరా
సి) రెండు బిందువుల మధ్య పరోక్ష కరెంట్ సరఫరా
డి) రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్‌కు అంతరాయం కలగడం
- View Answer
- సమాధానం: డి
15. కింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం?
ఎ) గ్రాఫైట్
బి) గ్రానైట్
సి) డైమండ్
డి) చార్కోల్
- View Answer
- సమాధానం: ఎ
16. కంప్యూటర్లోని ‘ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్’ను దేనితో తయారు చేస్తారు?
ఎ) వెండి
బి) సిలికాన్
సి) జెర్మేనియం
డి) సిలికా
- View Answer
- సమాధానం: బి
17.కింది వాటిలో రిఫ్రిజిరేటర్స్, ఎ.సి. గదుల్లో పని చేసే సూత్రం ఏది?
ఎ) పెల్టియర్ ఫలితం
బి) సీబెక్ ఫలితం
సి) థామ్సన్ ఫలితం
డి) కాంతి విద్యుత్ ఫలితం
- View Answer
- సమాధానం: ఎ
18. కింది వాటిలో ట్రాన్సిస్టర్‌లో వాడే మూలకం ఏది?
ఎ) సిలికాన్
బి) కాపర్
సి) సిల్వర్
డి) బంగారం
- View Answer
- సమాధానం: ఎ
19. ఎలక్ట్రోప్లేటింగ్‌లో రాగిని ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) ద్రవీభవన స్థానం ఎక్కువ
బి) చౌకగా లభిస్తుంది
సి) మన్నిక ఎక్కువ
డి) విద్యుత్ నిరోధం తక్కువ
- View Answer
- సమాధానం: డి
20. పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి
బి) ఇనుము
సి) ఇనుము, మిశ్రమలోహం
డి) అల్యూమినియం
- View Answer
- సమాధానం: ఎ
21. రెక్టిఫయర్ను ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) డి.సి.ని ఎ.సి.గా మార్చడానికి
బి) ఎ.సి.ని డి.సి.గా మార్చడానికి
సి) అధిక వోల్టేజిని, తక్కువగా వోల్టేజిగా మార్చడానికి
డి) తక్కువ వోల్టేజిని, ఎక్కువ వోల్టేజిగా మార్చడానికి
- View Answer
- సమాధానం: బి
22. విద్యుత్ పొటెన్షియల్ ప్రమాణం ఏది?
ఎ) ఆంపియర్
బి) కూలుంబ్
సి) వోల్ట్
డి) ఓమ్
- View Answer
- సమాధానం: సి
23. కింది వాటిలో విద్యుత్ వలయంలో ఉండేది?
ఎ) విద్యుత్ జనకం
బి) విద్యుత్ వాహకం
సి) విద్యుత్ వినియోగదారుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
24. లోహాల్లో అథమ విద్యుత్ వాహకం ఏది?
ఎ) వెండి
బి) రాగి
సి) సీసం
డి) అల్యూమినియం
- View Answer
- సమాధానం: సి
25. లోహాలన్నీ ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఎందుకంటే వీటిలో స్వేచ్ఛగా సంచరించే కింది కణాలు ఉంటాయి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) పాజిట్రాన్లు
సి) ప్రోటాన్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
26. ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణంలో ఉపయోగించే పదార్థం?
ఎ) దృఢ ఇనుము
బి) రాగి
సి) మృదు ఇనుము
డి) అల్యూమినియం
- View Answer
- సమాధానం: సి
27. అనంత సంఖ్యలో ఆవేశాలు ఉన్న భూమి ఫలిత విద్యుత్ పొటెన్షియల్ ఎన్ని వోల్టులు?
ఎ) అనంతం
బి) శూన్యం
సి) లక్ష వోల్టులు
డి) 1 మెగా వోల్టులు
- View Answer
- సమాధానం: బి
28. వీధి దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు?
ఎ) శ్రేణి
బి) సమాంతర
సి) ఎ, బి
డి) కొన్ని శ్రేణిలో, కొన్ని సమాంతరంగా
- View Answer
- సమాధానం: ఎ
29. ట్యూబ్లైట్లో ఉపయోగించే స్టార్టర్ పరికరంలో ఉండేది?
ఎ) బ్యాటరీ
బి) కెపాసిటర్
సి) ట్రాన్స్ ఫార్మర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
30. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏది?
ఎ) ఓమ్
బి) ఓమ్ + మీటర్
సి) ఓమ్-మీటర్
డి) ఓమ్/మీటర్
- View Answer
- సమాధానం: సి
31.విద్యుత్ బల్బుల్లో తొలిసారి ఉపయోగించిన ఫిలమెంట్ ఏది?
ఎ) టంగ్స్టన్
బి) రాగి
సి) జింక్
డి) కార్బన్
- View Answer
- సమాధానం: డి
32. సీఎఫ్ఎల్ బల్బుల్లో ఉపయోగించే పదార్థం?
ఎ) ఇన్వార్
బి) సోడియం ఆవిరి
సి) పాదరసం
డి) రాగి
- View Answer
- సమాధానం: సి
33. రాగి తీగను మంచు దిమ్మెపై అమర్చినప్పుడు ఆ తీగ విద్యుత్ వాహకత....
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) విద్యుత్ ప్రవహించదు
- View Answer
- సమాధానం: ఎ
34. డేనియల్ ఘటంలో విద్యుత్ విశ్లేషక పదార్థం?
ఎ) సల్య్ఫూరిక్ ఆమ్లం
బి) కాపర్ సల్ఫేట్
సి) జింక్ సల్ఫేట్
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
35. చార్జింగ్ బ్యాటరీని కనిపెట్టిన శాస్త్రవేత్త?
ఎ) ఓల్టా
బి) మైఖేల్ ఫారడే
సి) గాస్టన్ ప్లాంటే
డి) కూలుంబ్
- View Answer
- సమాధానం: సి
36.యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది?
ఎ) విద్యుత్ మోటార్
బి) సైకిల్ డైనమో
సి) ట్రాన్స్ ఫార్మర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
37. అధిక ఉష్ణోగ్రత వద్ద ‘సూపర్ కండక్టివిటీ’ని ప్రదర్శించే పదార్థం?
ఎ) పాదరసం
బి) రాగి
సి) పింగాణి
డి) ఉక్కు
- View Answer
- సమాధానం: సి
38. సజాతి ఆవేశాలు ఇచ్చినప్పుడు సబ్బు బుడగ పరిమాణం ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండింతలు అవుతుంది
- View Answer
- సమాధానం: ఎ
39. విద్యుచ్ఛాలక బలాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) వోల్ట్ మీటర్
బి) రియోస్టాట్
సి) పొటెన్షియో మీటర్
డి) అమ్మీటర్
- View Answer
- సమాధానం: సి
40. విద్యుత్ ఇస్త్రీ పెట్టెల్లో ఉపయోగించే అభ్రకం ఒక...
ఎ) విద్యుత్ వాహకం, ఉష్ణ బంధకం
బి) విద్యుత్ బంధకం, ఉష్ణ వాహకం
సి) విద్యుత్, ఉష్ణ వాహకం
డి) విద్యుత్, ఉష్ణ బంధకం
- View Answer
- సమాధానం: బి
41.కింది వాటిలో నిక్రోమ్ తీగ లక్షణం ఏది?
ఎ) అధిక నిరోధం, అల్ప ద్రవీభవనం
బి) అధిక నిరోధం, అధిక ద్రవీభవనం
సి) అల్ప నిరోధం, అల్ప ద్రవీభవనం
డి) అల్పనిరోధం, అధిక ద్రవీభవనం
- View Answer
- సమాధానం: బి
42. తక్కువ వోల్టేజి వద్ద ఎక్కువ విద్యుత్ శక్తి ఆవేశాన్ని నిల్వచేయడానికి ఉపయోగించే విద్యుత్ సాధనం?
ఎ) ట్రాన్స్ ఫార్మర్
బి) బ్యాటరీ
సి) కెపాసిటర్
డి) గాల్వనోమీటర్
- View Answer
- సమాధానం: సి
43.అతి తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) కదిలే తీగచుట్ట గాల్వానో మీటర్
బి) టాంజెంట్ గాల్వనో మీటర్
సి) అమ్మీటర్
డి) వోల్ట్‌మీటర్
- View Answer
- సమాధానం: ఎ
44. కింది వాటిలో విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం ఏది?
ఎ) గాజు
బి) గ్రాఫైట్
సి) పెట్రోల్
డి) పింగాణి
- View Answer
- సమాధానం: బి
45. ట్రాన్స్ ఫార్మర్లో ఏ ద్రవాన్ని నింపుతారు?
ఎ) పాదరసం
బి) ద్రవ హైడ్రోజన్
సి) ద్రవ హీలియం
డి) గంధకామ్లం
- View Answer
- సమాధానం: సి
46. ఏకాంతర విద్యుత్‌ను ఏకముఖ విద్యుత్‌గా మార్చడానికి ఉపయోగించే పరికరం?
ఎ) బ్యాటరీ
బి) ట్రాన్స్ ఫార్మర్
సి) కండెన్సర్
డి) ధిక్కారి
- View Answer
- సమాధానం: డి
47. స్టోరేజీ బ్యాటరీల్లో ఉపయోగించే రసాయన పదార్థం?
ఎ) కాపర్ సల్ఫేట్
బి) అమ్మోనియం క్లోరైడ్
సి) గంధకామ్లం
డి) నత్రికామ్లం
- View Answer
- సమాధానం: సి
48. బెన్నెట్ ఆవిష్కరించిన ‘స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని’ ఉపయోగించి దేన్ని కనుగొనవచ్చు?
ఎ) విద్యుత్ ఆవేశం
బి) విద్యుత్ నిరోధం
సి) విద్యుత్ పొటెన్షియల్
డి) విద్యుచ్ఛాలక బలం
- View Answer
- సమాధానం: ఎ
49. ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రతా మాపకాన్ని ఏ పదార్థంతో తయారుచేస్తారు?
ఎ) రాగి- అల్యూమినియం
బి) పాదరసం
సి) ఆంటిమోని - బిస్మత్
డి) రాగి - ఉక్కు
- View Answer
- సమాధానం: సి
50. ప్రసార నష్టం తక్కువగా ఉండే విద్యుత్?
ఎ) ఏకముఖ
బి) ఏకాంతర
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి