Skip to main content

జి.ఎస్.టి. కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది ఎవరు?

భారత్ - ఇటీవలి పరిణామాలు:
  వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థైలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్‌లో సభ్య దేశాలు. 2019 నవంబర్ 13-14న 11వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో జరిగింది. Economic Growth for an Innovative Future నేపథ్యంగా ఈ సదస్సు బ్రెసిలియా డిక్లరేషన్‌ను రూపొందించింది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న రక్షిత విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవరోధమని సదస్సు గుర్తించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సొంత ప్రయోజనాల పరిరక్షణకు బహుళ పాక్షిక వాణిజ్యం (Multilateralism) ప్రధానమైంది. ఐక్యరాజ్య సమితితోపాటు బహుళపక్ష సంస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధిని పటిష్టపరచడంతోపాటు సంస్కరణలను ఆయా సంస్థల్లో తీసుకురావలసిన ఆవశ్యవతను సదస్సు గుర్తించింది. తీవ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతున్నదని భారత్ పేర్కొంది. మొదటి ‘బ్రిక్స్ దేశాల water ministers  సమావేశం నిర్వహిస్తామని భారత్ ప్రతిపాదించింది. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 15 శాతం. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో పెట్టుబడులకు సభ్య దేశాల వ్యాపార వేత్తలను భారత్ ఆహ్వానించింది. భారత పౌరులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతించాలని బ్రెజిల్ నిర్ణయించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో పెట్టుబడులకు భారత్‌ను రష్యా ఆహ్వానించింది.

  2018 ఫిబ్రవరి నుంచి భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నిర్వచనం మార్పులో భాగంగా పెట్టుబడుల స్థానంలో వార్షిక టర్నోవర్‌ను తీసుకోవడం జరిగింది. వార్షిక టర్నోవర్ పరిమితి సూక్ష్మ సంస్థలకు రూ. 5 కోట్ల కంటే తక్కువ, చిన్న సంస్థలకు రూ. 5 కోట్ల నుంచి రూ. 75 కోట్లు, మధ్య తరహా సంస్థలకు రూ. 75 నుంచి 250 కోట్లుగా ప్రతిపాదించారు. తయారీ, సేవా రంగంలో నిమగ్నమైన ఆయా సంస్థలకు ఈ పరిమితి వర్తిస్తుంది.

  భారత్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీతోపాటు మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బి.పి.సి.ఎల్.లో 53.29 శాతం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 63.75 శాతం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 30.8 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తేహ్రి హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, నార్‌‌త ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోను పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నురాబడిలో 36.8 శాతం, రుణేతర మూలధన రాబడిలో 17.2 శాతాన్ని మాత్రమే 2019 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వం సాధించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది.

  ఇటీవలి కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో స్వల్ప పెరుగుదల, గ్రామీణ వ్యవసాయ వేతనాల్లో కొద్దిపాటి పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభానికి కారణాలుగా నిలిచాయి. గత ఐదు సంవత్సరాలుగా అనేక పేదల అనుకూల సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. దీర్ఘకాల పేదరికం బహుమితీయ పేదరికంలో 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో తగ్గుదల ఏర్పడింది. బహుమితీయ పేదరికాన్ని పౌష్టికాహారం, పిల్లల మరణాలు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విదుచ్ఛక్తి, హౌసింగ్, ఆస్తులు, Years of schooling నిర్ణయిస్తాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుకు 2012-13 బడ్జెట్‌లో రూ. 50,162 కోట్లను కేటాయించగా ఈ మొత్తం 2019-20లో రూ. 1.18 లక్షల కోట్లకు పెరిగింది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ రోడ్ల కనెక్టివిటీలోను ప్రగతి ఏర్పడింది. తద్వారా 97 శాతం అర్హతకల్గిన, Feasible హాబిటేషన్స్కు రోడ్ల కనెక్టివిటీ ఏర్పడింది. 2018-19లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.268 కోట్ల వ్యక్తిగత పని దినాలు కల్పించారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ‘దీనదయాళ్ అంత్యోదయ యోజన’ పథకం కింద రూ.2,12,000 కోట్ల రుణాన్ని అందించారు.
 
మాదిరి ప్రశ్నలు :
Published date : 02 Dec 2019 12:15PM

Photo Stories