Skip to main content

Tenth and Inter: పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీ ఓపెన్ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్‌ కోర్సులకు మే 2 నుంచి పరీక్షలు జరగనున్నాయి.
Release of Tenth and Inter Open School Exam Schedule
పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈ మేరకు విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మార్చి 7న షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు మే 13 నుంచి 17 వరకు ఆదివారంతో సహా జరుగుతాయని మంత్రి వెల్లడించారు. హాల్టికెట్లో నిర్దేశించిన సబ్జెక్టులకు సరైన ప్రశ్నపత్రం తీసుకోవాలని, అలాకాకుండా వేరొక ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాస్తే ఫలితాన్ని రద్దు చేస్తామని, దీనికి సంబంధిత విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తమకు నిర్దేశించిన కేంద్రంలోనే పరీక్షకు హాజరవ్వాలని ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకుడు కె.వి.శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు.

పరీక్షల షెడ్యూల్..

తేదీ

పది

ఇంటర్‌

మే 2

తెలుగు/ఉర్దూ/

హిందీ/తెలుగు

కన్నడ/ఒరియా/తవిుళం

ఉర్దూ

మే 4

ఇంగి్లష్‌

ఇంగ్లిష్‌

మే 5

గణితం

గణితం

భారతీయ సంస్కృతి, వారసత్వం

చరిత్ర

––

వ్యాపార గణాంక శాస్త్రం

మే 7

శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం

భౌతిక శాస్త్రం

గృహ విజ్ఞానం

రాజనీతి శాస్త్రం, పౌరశాస్త్రం

––

మనో విజ్ఞాన శాస్త్రం

మే 9

సాంఘిక శాస్త్రం

రసాయన శాస్త్రం

ఆరి్థక శాస్త్రం

ఆరి్థక శాస్త్రం

––

సామాజిక శాస్త్రం

మే 10

హిందీ

జీవ శాస్త్రం

––

వాణిజ్య, వ్యాపార శాస్త్రం

––

గృహ విజ్ఞాన శాస్త్రం

మే 11

బిజినెస్‌ స్టడీస్‌

అన్ని వృత్తి విద్యాకోర్సులు

మనో విజ్ఞాన శాస్త్రం

––

అన్ని వృత్తి విద్యాకోర్సులు

––

చదవండి:

​​​​​​​ దూరవిద్య టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు

పాఠశాలలు ప్రారంభించకపోతే.. పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం..

Published date : 08 Mar 2022 03:19PM

Photo Stories