Skip to main content

Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం... వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు!

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం... వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు!
Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం... వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు!
Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం... వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు!

విజయవాడ పశ్చిమ : జిల్లాలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల సందడి ప్రారంభమైంది. అధికార యంత్రాంగం పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు 20వ తేదీ నాటికి ముగిశాయి. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి స్థాయి భద్రతతో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 76,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్‌ ఢిల్లీరావు అధ్యక్షతన పరీక్షల ఏర్పాటుకు సంబంధించి సమీక్ష నిర్వహించి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వోకేషనల్‌ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు 1938 మంది ఉన్నారు. అలాగే మొదటి ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న వారిలో మొదటి ఏడాది విద్యార్థులు 40,391 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 35,701 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షలు రాయనున్నారు.
పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు...

Also ReadAndhra Pradesh Intermediate Halltickets-2024 

ఎన్టీఆర్‌ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మార్చి మొదటి తేదీ నుంచి జరిగే ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కొనసాగుతాయి. మార్చి 1, 4, 6, 9, 13, 15, 18, 20 తేదీల్లో మొదటి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 2, 5, 7, 11, 14, 16, 19, 21 తేదీల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆయా కేంద్రాల్లోని మౌలిక వసతుల గురించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కేంద్రంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నీచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు....

పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థులు హాల్‌టిక్కెట్లు జారీ చేసేందుకు ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉండటంతో ఈ ఏడాది సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థీ హాల్‌టిక్కెట్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. నేరుగా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు. హాల్‌టికెట్‌ తీసుకుని నేరుగా పరీక్ష కేంద్రాలకు హాజరుకావచ్చని అధికారులు ప్రకటించారు

Also Read : AP Inter 1st Year Study Material

మార్చి మొదటి తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఆయా విభాగాల అధికారులు, పరీక్షా కేంద్రాల బాధ్యులతో సమావేశం నిర్వహించాం. అందులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు చివరి వరకూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

                                                                                               – సీఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

Published date : 26 Feb 2024 01:05PM

Photo Stories