Skip to main content

Intermediate Exams 2024: ఇంటర్‌ హాల్‌టికెట్ల విడుదల

Intermediate Exams 2024: ఇంటర్‌ హాల్‌టికెట్ల విడుదల
Intermediate Exams 2024: ఇంటర్‌ హాల్‌టికెట్ల విడుదల
Intermediate Exams 2024: ఇంటర్‌ హాల్‌టికెట్ల విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రార­ంభం కానున్న ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్‌­ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూని­యర్‌ కళాశాలలో హాల్‌టికెట్లను ఆయన విద్యార్థులకు అందజేశారు. ఆయ­న మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరవుతున్నారన్నారు.

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోందని, ఇప్పటికే పనులు పూర్తయిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను చూసి ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆశ్చర్యపోతాయన్నారు.

Also Read:  Previous Papers

ప్రభుత్వ యాప్‌లపై అవగాహన పెంచాలి
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్‌’ వంటి యాప్స్‌ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీ­ణ్‌ ప్రకాశ్‌ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్టీ, ఎఫ్‌ఎల్‌ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్‌ఎఫ్‌ఈ, శామో, టోఫెల్‌ నిర్వహణ తదితర విభా­గాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరి­పారు.

విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్‌ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్‌ మెసేజ్‌గా అనువాదం చేసుకోవచ్చన్నారు. ఫార్మెటివ్‌ సమ్మేటివ్‌ పరీక్షల మార్కులను డిజీ లాకర్‌ యాప్‌ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజ­మాన్య పాఠశాలలను ఎస్‌సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును అధ్యయనం చేస్తాయన్నారు.

Published date : 22 Feb 2024 06:11PM

Photo Stories