Skip to main content

Intermediate Practical Exams:ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి

Intermediate Practical Exams
Intermediate Practical Exams

అనంతపురం ఎడ్యుకేషన్‌: పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకూ ఉంటాయి. జిల్లాలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు మొత్తం 35,973 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

Also Read AP Inter Public Exams Time Table 2024

పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు సాగుతాయి. రెగ్యులర్‌ విద్యార్థులు 31,369 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 9,587 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల షెడ్యూలు రావడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
 

Published date : 15 Dec 2023 12:10PM

Photo Stories