Intermediate: ఇంటర్ పరీక్ష ఫీజు గడువుకి చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజును డిసెంబర్ 23వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు డిసెంబర్ 17 న ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇంటర్ పరీక్ష ఫీజు గడువుకి చివరి తేదీ ఇదే..
అపరాధ రుసుములతో జనవరి 25 వరకు వివిధ తేదీల గడువులను నిర్ణయించింది. అపరాధ రుసుము రూ.120తో డిసెంబర్ 30, రూ.500తో జనవరి 4, రూ.1,000తో జనవరి 10, రూ.2 వేలతో జనవరి 17, రూ.3 వేలతో జనవరి 20, రూ.5 వేల ఫీజుతో జనవరి 25వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.