Inter Exam Preparation Tips: ఇంటర్‌లో.. టాప్ స్కోర్ ఇలా!
- ఏపీ, తెలంగాణలో 2024 ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- ఏపీలో మార్చి 1 నుంచి, తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు
- భవిష్యత్తులో కీలకంగా మారుతున్న ఇంటర్ మార్కులు
ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్‌లు భవిష్యత్తులో ఉన్నత విద్య కోర్సుల్లో చేరడానికి, అదే విధంగా ఆయా కోర్సుల్లో రాణించడానికి కూడా కీలకంగా నిలుస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తాము చదువుతున్న గ్రూప్ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి అంటున్నారు నిపుణులు. తద్వారా ఇంటర్ వార్షిక పరీక్షల్లో బెస్ట్ స్కోర్ సొంతం చేసుకుకోవచ్చని పేర్కొంటున్నారు.
ఏపీలో మార్చి 1 నుంచి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2024, మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. దీంతో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయం విద్యార్థులకు ఎంతో అమూల్యమైంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
చదవండి: AP Inter Study Material
ఇంటర్ ఎంపీసీ
ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుతమున్న సమయంలో మ్యాథమెటిక్స్ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌పై బాగా దృష్టి పెట్టాలి. వీటిని కొశ్చన్ అండ్ ఆన్సర్ మాదిరిగా కాకుండా.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో సాధించాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే జేఈఈ మెయిన్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా సిలబస్ అంశాలకు అనుగుణంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు -సమాధానాల రూపంలో ప్రిపరేషన్ సాగించాలి. జేఈఈ రాసే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచి ఎక్కువ సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఫిబ్రవరి మధ్య నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టాలి. అకాడమీ పుస్తకాల్లోని అన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్‌కు ప్రాధాన్వమివ్వాలి. వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. అదే విధంగా కనీసం రెండు ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరవ్వాలి.
మ్యాథమెటిక్స్
ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు; సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్‌పై ఎక్కువ సమయం కేటాయించాలి.
ఫిజిక్స్
- ఫిజిక్స్‌కు సంబంధించి విద్యార్థులు జనవరిలో స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నల సాధనకు ఎక్కువ కృషి చేయాలి. ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి.. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ వంటి అంశాల్లో పట్టు సాధించే విధంగా రివిజన్‌కు సమయం కేటాయించాలి.
- ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్‌లో లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌ను సాధన చేసేటప్పుడు అంచెలవారీ పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ఫలితంగా సదరు సమస్యకు సంబంధించి ప్రాథమిక భావనలపైనా పట్టు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది.
కెమిస్ట్రీ
కెమిస్ట్రీకి సంబంధించి ముఖ్యాంశాలను నోట్ చేసుకుంటూ చదవాలి. ప్రస్తుత సమయంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి. దీంతోపాటు మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు జనవరి చివరి నాటికి సబ్జెక్ట్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసుకుని.. ఫిబ్రవరి నెలలో అధిక సమయం రివిజన్‌కు కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరంలో.. విద్యుత్ రసాయన శాస్త్రం; పి-బ్లాక్ మూలకాలు, డి, ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం; సాలిడ్ స్టేట్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలతో నోట్స్ రాసుకోవడం మేలు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
చదవండి: Model papers
ఇంటర్ బైపీసీ
బోటనీ
బైపీసీ విద్యార్థులు బోటనీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు అనలిటికల్ అప్రోచ్‌ను అనుసరించాలి. ఒక ప్రశ్నకు సమాధానం సాధించే క్రమంలో ఇమిడి ఉన్న అనువర్తిత అంశాలను నిజ జీవితంలోని పరిస్థితులతో బేరీజు వేస్తూ సాగాలి. ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్ (మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ(బ్యాక్టీరియా, వైరస్), జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ టాపిక్స్‌పైనా పట్టు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయో టెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
జువాలజీ
జనవరి చివరి నాటికి జువాలజీ సిలబస్ పూర్తి చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్‌లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ-సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్‌లో కూడా గ్రాఫికల్ ప్రజంటేషన్ మార్కుల సాధనలో కీలకంగా మారుతుంది. కాబట్టి డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ సబ్జెక్ట్‌లో రెండు సంవత్సరాలకు సంబంధించి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రొటొజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లయిడ్ బయాలజీలపై ప్రత్యేక దృష్టితో చదవాలి.
ఫిజిక్స్
బైపీసీ-ఫిజిక్స్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం;విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
కెమిస్ట్రీ
బైపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కెమిస్ట్రీకి సంబంధించి ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేయాలి. సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్.. జనరల్ టిప్స్
- జనవరి చివరి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ఊ ఫిబ్రవరి నుంచి పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. ఊ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు జనవరి మూడో వారానికి సిలబస్ పూర్తి చేసుకుని తర్వాత సమయాన్ని ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టడం మంచిది.
- షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి. ఊ లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వాటి నుంచి అడిగే అవకాశం ఉన్న షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు సంబంధించిన అంశాలు నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఊ విద్యార్థులు క్లాస్‌రూం లెక్చర్‌కు అదనంగా ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల స్వీయ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఊ మెమొరీ టిప్స్ (విజువల్ ఇమాజినేషన్; షార్ట్ నోట్స్)ను పాటించడం మేలు.
Tags
- Inter
- Inter Exams
- Inter Exam Preparation Tips
- How to prepare inter exams preparation
- TS Inter Preparation Tips
- AP Inter Exam Preparation Tips
- Inter Exam Study Material
- Intermediate Exam Guidance
- Inter Exam Model Paper
- Intermediate subjects
- JEE Main
- Intermediate
- TimeManagement
- RevisionStrategies
- FutureEducation
- StudyStrategies
- inspirations
- ExamPreparation Tips
- Sakshi Education Latest News