Examination fee Norms:నిబంధనల మేరకే ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు
చిత్తూరు కలెక్టరేట్ : నిబంధనల మేరకే ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే రూ.2లక్షల జరిమానా తప్పదని, కళాశాలను సైతం సీజ్ చేస్తామని ఉమ్మడి జిల్లా ఆర్‌ఐఓ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం చిత్తూరులోని పీసీఆర్ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీఈఆర్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు.
Also Read : schools holidays: రేపు ఎల్లుండి పాఠశాలలకు సెలవులు...ఎందుకంటే...
2022–23 విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రీ అడ్మిషన్ అయ్యే విద్యార్థులకుఅమ్మఒడి, రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా ఏ,బీ, సీ గ్రేడ్‌ల సర్టిఫికెట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫెయిల్ అయిన వారు 16,793 మంది ఉన్నట్లు వివరించారు. వీరి పరీక్ష ఫీజును ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా చెల్లించేలా ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలన్నారు. ఫీజులు చెల్లించకపోతే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీవైఈఓ సయ్యద్‌మౌలా, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ మజీద్ పాల్గొన్నారు.
Tags
- AP Intermediate Exam Fee 2024
- AP Inter exams Fee
- AP Inter Annual exams Fee News
- AP Inter Fee
- Examination fee as Per Norms
- ChittoorCollectorate
- PrabhakarReddy
- IntermediateExamFees
- RulesCompliance
- FineImposition
- GovernmentColleges
- PrivateCollegeOwners
- PCRJuniorCollege
- TuesdayMeeting
- GovernmentAttention
- GERRegistration
- Sakshi Education Latest News