AP Gurukulam Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : గుత్తి మండలం రజాపురం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల కళాశాల, ఉరవకొండలోని అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
AP Gurukulam Inter Admissions 2023
ఈ మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎస్‌ఎస్ ఉషారాణి, సునీత మంగళవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఉరవకొండలోని కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 15, ఎస్టీలకు రెండు, ఓసీలకు ఒకటి చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. అలాగే ఎంఈసీ గ్రూపులో ఎస్సీలకు 26, ఎస్టీలకు రెండు, బీసీలకు రెండు, ఓసీలకు ఒకటి, రజాపురంలోని కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఎస్సీలకు రెండు, ఎస్టీలకు రెండు, బైపీసీలో ఎస్టీలకు ఒక సీటు చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ (రెగ్యులర్)లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 360కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తులను బుధవారం సాయంత్రం 4 గంటల్లోపు అందజేయాలన్నారు. ఎంపిక జాబితాను ఈ నెల 27న ప్రకటిస్తామన్నారు.