యథావిధిగా టీఎస్ టెన్త్ పరీక్షలు
Sakshi Education
మార్చి 31 నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎస్‌ఎస్‌సీ (పదవ తరగతి) పరీక్షలు యథావిధిగా జరపాలని అధికారులు నిర్ణయించారు.
వాయిదా వేయాల్సిన పరిస్థితుల్లేవని, ముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, బీటెక్, మిగతా డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. డిగ్రీ లేదా బీటెక్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు విధిలేని పరిస్థితుల్లో అయితేనే వాయిదా వేయాలని.. తప్పదు అనుకున్నవి, సిలబస్ ఇప్పటికే పూర్తయి పరీక్షలు రాయాల్సి ఉన్నవన్నీ యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు.
Published date : 17 Mar 2020 01:03PM