Skip to main content

KGBV: టీచర్లకు బదిలీలు

రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (KGBVల్లో) పనిచేస్తున్న బోధన సిబ్బందికి బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం జూన్‌ 30న జీవో 103 విడుదల చేసింది.
Transfers to KGBV teachers
కేజీబీవీ టీచర్లకు బదిలీలు

2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ బదిలీల మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది. పాత జిల్లాల యూనిట్‌గా ఈ బదిలీలు ఉంటాయి. ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీఈటీ, పీజీటీలలో ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు. అయిదేళ్ల సర్వీసు పూర్తయిన ప్రిన్సిపాళ్లకు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన సీఆర్టీలు, పీఈటీలకు బదిలీ తప్పనిసరి. పనిచేస్తున్న KGBVల్లో ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారో ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పాలనాపరమైన లేదా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇదివరకు బదిలీ అయినవారు ప్రస్తుత బదిలీలకు అర్హులు కారు. కేవలం జిల్లాల పరిధిలో మాత్రమే ఈ బదిలీలుంటాయి. సీనియార్టీ లెక్కింపునకు వివిధ అంశాల్లో ఎన్‌టైటిల్‌మెంటు, కామన్, స్పెషల్‌ పాయింట్లను కేటాయించారు. ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ కింద వివిధ కేటగిరీల్లోని వారికి బదిలీల్లో ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుత ఖాళీలతోపాటు, తప్పనిసరి బదిలీల్లో ఖాళీ అయ్యేవాటిని, కౌన్సెలింగ్‌లో బదిలీతో వచ్చే ఖాళీలను, ఏడాదిగా అధికారిక, అనధికారికంగా హాజరుకాకుండా ఉన్నవారి ఖాళీలను గుర్తించి ప్రకటిస్తారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో, అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ సభ్యులుగా కమిటీలను నియమించి బదిలీలు చేపడతారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహిస్తారు. 

చదవండి: 

Published date : 30 Jun 2022 02:49PM

Photo Stories