Schools: అభివృద్ధిలో వీరే కీలకం
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులే కీలకభూమిక పోషించాలన్నారు. సమగ్ర శిక్ష, సీమ్యాట్ ఆధ్వర్యంలో ‘సమగ్ర పాఠశాల మూల్యాంకన విధానం–సామాజిక తనిఖీ, పర్యావరణ, సామాజిక వ్యవస్థల విధానాల అమలు’పైన ఏప్రిల్ 19న విజయవాడలో జరిగిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యావ్యవస్థ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పారు.
చదవండి: IIT Council: ఐఐటీలలో మానసిక ఆరోగ్య సలహాదారులు
పాఠశాలల్లో సామాజిక తనిఖీ అంటే భయపడాల్సిన అవసరం లేదని, స్థానిక ప్రజల్లో ప్రభుత్వ బడుల పనితీరు గురించి అవగాహన పెంచడానికే సామాజిక తనిఖీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యా సంబంధిత అంశాల్లో ఏ పాఠశాలైనా వెనుకబడినట్లు ఉంటే సత్వర పరిష్కారాల దిశగా సోషల్ ఆడిట్ యాప్ వినియోగపడుతుందని చెప్పారు. ఈ సంద్భరంగా ‘పాఠశాల సామాజిక తనిఖీ శిక్షణ కరదీపిక’ను ఆవిష్కరించారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, కైవల్య సంస్థ ప్రతినిధులు సాయికృష్ణ, నాగమ్మ, సమగ్రశిక్ష సిబ్బంది డాక్టర్ ఎ.సుహాసిని, డాక్టర్ పెంచులయ్య, బాబురావు పాల్గొన్నారు.