Skip to main content

Tenth Class: టెన్త్ హాల్‌ టికెట్లు రెడీ.. 10/10 గ్రేడ్ సాధించాలనుందా... మోడల్ పేపర్‌లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

రాష్ట్రంలో ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లను సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి ఏప్రిల్‌ 18న ఒక ప్రకటనలో తెలిపారు.
టెన్త్ హాల్‌ టికెట్లు రెడీ.. 10/10 గ్రేడ్ సాధించాలనుందా... మోడల్ పేపర్‌లు డౌన్‌లోడ్ చేసుకోండిలా
టెన్త్ హాల్‌ టికెట్లు రెడీ.. 10/10 గ్రేడ్ సాధించాలనుందా... మోడల్ పేపర్‌లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ‘బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ నుంచి స్కూల్‌ లాగిన్‌ ద్వారా వీటిని డౌన్ లోడ్‌ చేసుకుని అటెస్ట్‌ చేసిన తరువాత విద్యార్థులకు అందించాలని సూచించారు. హాల్‌ టికెట్లలో విద్యార్థుల ఫొటో ఇమేజ్‌ లేకపోయినా, అస్పష్టంగా ఉన్నా వాటిపై సదరు విద్యార్థుల ఫొటోలను అతికించి అటెస్ట్‌ చేసి, వారితో కూడా సంతకం చేయించి పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫొటోలను కొత్తగా అతికించిన హాల్‌టికెట్లకు సంబంధించిన ఫోటోలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలని కోరారు.

కోవిడ్ మహమ్మారి పరిస్థితి కారణంగా 2022 విద్యా సంవత్సరానికి గాను AP 10వ తరగతి సిలబస్‌ను 70%కి తగ్గించిన సంగతి తెలిసిందే.
తగ్గిన సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రాలను సిద్ధం చేసేందుకు AP SSC బోర్డు అన్ని చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి, సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో, తగ్గించిన సిలబస్ ప్రకారం సాక్షిఎడ్యుకేషన్ AP 10వ తరగతి 2022 మోడల్ పేపర్‌లను సిద్ధం చేసింది. ఈ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం వల్ల విద్యార్థులు మెరుగైన గ్రేడ్‌లు సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో మోడల్ పేపర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పరీక్షలలో అడిగే ప్రశ్నల రకాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి. సాక్షి ఎడ్యుకేషన్ 10వ తరగతికి సంబంధించిన సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన ప్రశ్నలను కూడా అందిస్తుంది.

AP 10వ తరగతి 2022 మోడల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చదవండి: 

AP 10వ తరగతి 2022 కొత్త టైమ్ టేబుల్‌

​​​​​​​AP 10వ తరగతి బిట్‌బ్యాంక్‌ని డౌన్లోడ్ చేసుకోండి

Published date : 19 Apr 2022 01:04PM

Photo Stories