Certificates: టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి
Sakshi Education
పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు.
చదవండి:
Good News: టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు పెంపు
Published date : 25 Dec 2021 02:33PM