తత్కాల్‌లో టెన్త్ ఫీజుకు తుది గడువు జనవరి 22
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇప్పటికీ పరీక్ష ఫీజు చెల్లించని వారు ఉంటే తత్కాల్ కింద వారంతా ఈనెల 22వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు.
తత్కాల్ కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని, దానికి అదనంగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటు విద్యార్థులు (వన్స్ ఫెయిల్డ్) ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత మళ్లీ గడువు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఇప్పుడు మార్చిలో పరీక్షలు రాస్తేనే మే/జూన్ ల్లో జరిగే అడ్వాన్ ్సడ్ సప్లిమెంటరీలో పరీక్షలు రాసేందుకు అర్హులని పేర్కొన్నారు.
Published date : 08 Jan 2020 01:14PM