టెన్త్ థర్డ్ లాంగ్వేజ్ ప్రీ ఫైనల్ పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తున్న థర్డ్ లాంగ్వేజ్ పేపర్-1,పేపర్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఫిబ్రవరి 11 నుంచి 25 తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఫిబ్రవరి 14న జరపాల్సిన థర్డ్‌పేపర్-1ను 26 తేదీకి, ఫిబ్రవరి 15న నిర్వహించాల్సిన థర్డ్‌పేపర్-2ను 27కు వాయిదా వేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ తెలిపారు.
Published date : 03 Feb 2020 04:44PM