తెలంగాణలో 2,560 టెన్త్ పరీక్షా కేంద్రాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్రంలో మార్చి 19 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల కోసం 2,560 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.
ఆయా కేంద్రాల్లో కల్పించాల్సిన సదుపాయాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు విద్యార్థులు ఫీజు చెల్లించిన దాని ప్రకారం మొత్తంగా 5,34,712 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,07,810 మంది ఉండగా, మిగతా వారు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు ఉంటాయని, నిర్ణీత తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికీ ఫీజు చెల్లించకుండా ఉండి, ఇపుడు పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈనెల 22లోగా తత్కాల్ నిర్ణీత ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
పదో తరగతి ప్రిపరేషన్, మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
పదో తరగతి ప్రిపరేషన్, మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 18 Jan 2020 02:11PM