Skip to main content

Strict Rules: అన్ని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు..

ఇటీవలె ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాలను పరిశీలించేందుకు సందర్శించిన కలెక్టర్‌ అక్కడి సదుపాయాలు, చర్యలను గమనించి అధికారులకు ఆదేశించారు..
Collector Abhishikt Kishore, DEO inspecting examination centres of Tenth Class

లక్కిరెడ్డిపల్లి: జిల్లాలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జిల్లా పరిషత్‌ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు.

AP Inter Public Exam Results Date 2024 : ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల..ఎప్పుడంటే..? ఈ సారి ముందుగానే..

ఈ సందర్భంగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద కొంతమంది బయట వ్యక్తులు గుంపుగా ఉండటంపై విద్యాశాఖ, పోలీస్‌ అధికారులపై కలెక్టర్‌ అసంతృప్తి వెలిబుచ్చారు. బయట వ్యక్తులందరినీ పరీక్షా కేంద్రాలకు దూరంగా పంపించాలని, పరీక్ష మొదలైన తర్వాత కేంద్రాల్లోకి ఇతరులు ఎవరినీ అనుమతించరాదన్నారు. కట్టుదిట్టంగా పరీక్షలను నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. కేంద్రాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌళిక సదుపాయాలపై కలెక్టర్‌ ఆరా తీశారు.

Yogi Vemana University: వైవీయూ ఎల్‌ఎల్‌బీ పరీక్ష తేదీల్లో మార్పు.. ఎప్పుడంటే..

కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు కట్టుదిట్టంగా జరిపేలా చీఫ్‌ సూపరిటెండెన్స్‌, ప్లైయింగ్‌, సిటింగ్‌ స్క్వాడ్‌ అధికారులు కృషి చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను నోఫోన్‌ జోన్‌గా ప్రకటించామని, ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్‌, విద్యాశాఖ అధికారులకు సూచించారు. డీఈఓ శివప్రకాష్‌ రెడ్డి, చీప్‌ సూపరిటెండెంట్లు, పోలీస్‌ అధికారులు, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Published date : 21 Mar 2024 11:18AM

Photo Stories