Annual Exams for Tenth Students: విద్యార్థులకు వార్షిక పరీక్షల తయారీ
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు ఐదునెలల గడువు ఉందని, ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వి.నాగరాజు ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి వెబెక్స్ నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ గతంతో పోల్చితే ఈ సంవత్సరం అన్ని పరిస్థితులూ అనుకూలంగా ఉన్నాయన్నారు.
➤ Civil Services Incentive Scheme: యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఆర్థిక అండగా జగనన్న పథకం
కోవిడ్ కారణంగా గతంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం అన్ని వసతులూ కల్పించిందన్నారు. చదువు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన, పర్యవేక్షించాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపైన ఉందన్నారు. ఎఫ్‌ఏ–2 ఫలితాల ఆధారంగా గ్రేడింగ్ చేసుకుని వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ పెట్టాలన్నారు. ఒక్క విద్యార్థి ఫెయిలైనా హెచ్‌ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
➤ Global Pension Index 2023: పెన్షన్ల వ్యవస్థల్లో దిగజారిన భారత్ ర్యాంక్
ఎంఈఓలు స్కూళ్లు తనిఖీ చేయాలి
మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓ) కచ్చితంగా రోజూ రెండు పాఠశాలలు తనిఖీ చేయాల్సిందేనని డీఈఓ స్పష్టం చేశారు. విద్యార్థుల నైపుణ్యం, వసతి, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలన్నారు. ప్రతి మండలానికీ ఇద్దరు ఎంఈఓలు ఉన్నారని, ఇద్దరూ రోజూ కనీసం నాలుగు స్కూళ్లు తనిఖీలు చేయాలని దిశా నిర్దేశం చేశారు.