Andhra Pradesh: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు.
స్థానిక రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22,640 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతేడాది విద్యార్థులు, 8వ తరగతి బోధించే టీచర్లకు కలిపి మొత్తం 25,640 ట్యాబ్‌లు అందజేశామన్నారు.
చదవండి: Tribal Sports School: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహం
రెండేళ్లలో ట్యాబ్‌ల కోసమే రూ.159.32 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. డిజిటల్ విద్యా విధానం అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
బైజూస్ కంటెంట్ కల్గిన ట్యాబ్‌లు విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, టోఫెల్‌పై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఏఐ టెక్నాలజీతో డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ కూడా ఇచ్చారన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
చదవండి: CP Vishnu S Warrier: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాల
అనంతరం విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్యాబ్‌ల పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని ఐఎఫ్‌పీ ద్వారా వీక్షించారు.
కార్యక్రమంలో అనంతపురం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, ఎంఈఓ వెంకటస్వామి, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి, బైజూస్ ట్యాబ్‌ల నోడల్ అధికారి ఓబుళరెడ్డి, సీఎంఓ గోపాలకృష్ణయ్య, అలెస్కో గోవిందరెడ్డి, అసిస్టెంట్ ఏఎంఓలు మాధవరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.