Tenth Class Exam 2024: వెబ్‌సైట్‌లో సవరించిన పదో తరగతి హాల్‌టికెట్లు
Sakshi Education
వెబ్‌సైట్‌లో సవరించిన పదో తరగతి హాల్‌టికెట్లు
Tenth Class Exam 2024: వెబ్‌సైట్‌లో సవరించిన పదో తరగతి హాల్‌టికెట్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లలో ఏర్పడిన సాంకేతిక లోపాలను సవరించి తిరిగి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఈఓ ఎస్.అబ్రహం ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ పరీక్షా కేంద్రం 51006 శ్రీ చైతన్య గవరవరం ఏలూరు, రెగ్యులర్ పరీక్షా కేంద్రం 51017 నారాయణ ఇంగ్లిష్ మీడి యం స్కూల్ ఆర్‌ఆర్‌పేటలో కేటాయించిన హాల్‌టికెట్లు సాంకేతిక కారణాల వల్ల పూర్తి చిరునామా ముద్రితం కాలేదని గుర్తించామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులను సంప్రదించి హాల్‌టికెట్లలో లోపాలను సరిచేశామని తెలిపా రు. వీటిని బీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, హెచ్‌ఎంలు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.