Skip to main content

‘కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ’

సాక్షి, అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఎస్‌.సురేష్‌ కుమార్‌ తెలిపారు.
Receipt of applications for admission to KGBVs
‘కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ’

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కసూ్తర్బాగాంధీ విద్యాలయాల్లో 2023–24 వి­ద్యా సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌ ( బడి మానేసిన వారు) పేద, ఎస్‌.సి, ఎస్‌.టి, బీసీ, మై­నారిటీ, బి.పి.ఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

చదవండి: ఈ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిష‌న్‌ కోసం పరిగణిస్తామని చెప్పారు. దరఖాస్తును‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీకేజీబీ వీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌’ సైట్‌ ద్వారా పొందవచ్చునన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్‌ బోర్డులో నేరుగా చూడవచ్చని, సందేహాలు ఉంటే 9494383617, 94412 70099, 9441214607, 9490782111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చదవండి: 292 కొత్త జూనియర్‌ కాలేజీల్లో సిబ్బంది నియామకం

Published date : 23 Mar 2023 05:38PM

Photo Stories