Department of Education: సమ్మెటివ్–1 పరీక్షలకు సర్వం సిద్ధం
ఇందులో భాగంగా 1–10 తరగతుల విద్యార్థులకు ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమౌతోంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు జరిగే పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది.
జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ద్వారా ఆయాపరీక్షా పత్రాలు ఇప్పటికే మండల కేంద్రాలకు సరఫరా అయ్యాయి.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
సిలబస్ పూర్తి చేశాకనే పరీక్షలు: కె.శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి పల్నాడు
28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో దాదాపు మూడు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ సూచన మేరకు గత వారం రోజులుగా అన్ని పాఠశాలల్లో తరగతుల వారీగా పర్యవేక్షించాం.
సిలబస్‌తోపాటు వర్క్, నోట్‌బుక్స్ కూడా పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాకనే పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యాం.