Tenth Class Exam 2024: టెన్త్ విద్యార్థులు పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనల..... ప్రభుత్వ మార్గదర్శకాలు
మదనపల్లె : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. టెన్త్ విద్యార్థులు తొలిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. చదువుతున్న పాఠశాలకు దూరంగా కొత్తగా కేటాయించిన కేంద్రానికి వెళ్లి, పరీక్ష రాయాల్సిన విద్యార్థుల్లో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దీనిని దృిష్టిలో ఉంచుకున్న ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలతో ముద్రించింది. ఈనెల 18 నుంచి 30వతేదీ వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 25,522 మంది హాజరు కానున్నారు. వీరి కోసం 129 కేంద్రాలను సిద్ధం చేశారు. హాల్ టికెట్లు పొందిన విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలను తమ తల్లిదండ్రులతో పాటు సందర్శించడం ఉత్తమం.
విద్యార్థులూ..వీటిని పాటించండి
● ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
● ఉదయం 8.45 నుంచి 9.30 వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9.30 తరువాత గేట్లు మూసి వేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
● హాల్‌టక్కెట్లు పొందిన విద్యార్థులు దానిపై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ముందుగానే తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి, సరి చేయించుకోవాలి.
Also Read : Model Papers 2024
● క్వశ్చన్ పేపర్‌పై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్ ఉంటుంది. హాల్‌టిక్కెట్‌పై ఉన్న ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఆధారంగా కేటాయించిన రూముల వారీగా విద్యార్థులను కూర్చోబెడతారు. బార్ కోడింగ్ విధానంలో రూపొందించిన ఓఎంఆర్ షీట్లను విద్యార్థుల రోల్ నంబర్ ఆధారంగా పంపిణీ చేస్తారు.
● రోల్ నంబర్ ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తరువాత ఇన్విజిలేటర్ వచ్చి బార్ కోడింగ్‌తో కూడిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నాపత్రం, ఆన్సర్ బుక్‌లెట్ అందజేస్తారు. తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా పూరించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయరాదు.
● ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైన తరువాత, మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష మగిసేవరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు. గుర్తింపుకార్డు కలిగి, పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్ బృందాలను పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు.