పేరెంట్స్ కమిటీ ఎన్నికలు
Sakshi Education
రాష్ట్రంలోని పాఠశాలల్లో సెప్టెంబర్ 22న పేరెంట్స్ కమిటీ ఎన్నికలు సజావుగా ముగిశాయి.
ఈ ఎన్నికల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 46,609 స్కూళ్లకుగాను 44,237 స్కూళ్లలో(94.91%) ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని తెలిపారు. అందులో 19 వేల స్కూళ్లలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో 2,372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడినట్లు వెల్లడించారు. వెంటనే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Published date : 23 Sep 2021 12:07PM