Pradyumna: యువత భవితకు వారధులు తల్లిదండ్రులే
జనవరి 7న తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కెఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ యువతకు సరైన దిశా నిర్దేశం చేయడానికి స్వామి వివేకానంద లాంటి ఆథ్యాత్మిక గురువులు అవసరమన్నారు.
రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న యువజన ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువజన బృందాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారదాదేవి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన యువతీ యువకులను ఈ నెల 10వ తేదీన ప్రత్యేక బస్సుల ద్వారా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే జాతీయ యువజన ఉత్సవాలకు పంపిస్తామని అన్నారు.
చదవండి: Essay Competitions: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
జిజ్ఞాస ఫౌండేషన్ డైరెక్టర్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువజన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. యువతీ యువకులకు పోటీలతో పాటు సమ్మిట్లను, అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో యువతీ యువకులు స్టార్టప్‌లుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి అనేకమందికి ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.వి. రామకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి, వర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రొ వైస్ చాన్స్‌లర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్. హనుమంతరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.