ప్రత్యక్ష బోధన లేకుండా ‘పది’ పరీక్షలెలా? ఇంకా పూర్తికాని సిలబస్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా విస్తరణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశం ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవైపు విజృంభిస్తున్న సెకండ్ వేవ్.. మరోవైపు ప్రత్యక్ష బోధన లేకుండా వార్షిక పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనా విద్యా సంవత్సరంలో అకడమిక్ షెడ్యూలు అమలు కాకపోవడంతో పాటు ఆన్‌లైన్¯ బోధన విధానంలో సిలబస్ 50 శాతం పూర్తికాలేదు. వార్షిక పరీక్షలకు మిగిలింది 34 రోజులు. ఇప్పటి వరకు పరీక్ష కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. కేంద్రాల నిర్వహణకు సైతం ‘ప్రైవేట్’యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులకు సైతం పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో ఏర్పాట్లపై తర్జనభర్జన పడుతున్నారు.
తెలంగాణ పదో తరగతి 2021 ఎగ్జాం టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఆదిలోనే హంసపాదు..
బుర్రకెక్కింది 20 శాతమే..
ప్రమోట్ చేయడమే ఏకైక మార్గం..
పదోతరగతి సిలబస్ పూర్తి కానప్పుడు వార్షిక పరీక్షలు ఎలా నిర్వహిస్తారు. వాస్తవానికి అకడమిక్ షెడ్యూలు అమలు కాలేదు. కరోనా సెకండ్ వేవ్‌లో భౌతికంగా పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసినట్లే. గత విద్యా సంవత్సరం మాదిరిగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయడమే ఏకైక మార్గం.
– వెంకట్ సాయినాథ్, ప్రైవేటు స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి,
సిలబస్ 40 శాతం పూర్తి కాలేదు.
ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి సిలబస్ 40 శాతం మించలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆన్‌లైన్ తరగతులు సక్రమంగా నిర్వహించలేకపోయాం. విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన కలగలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. అలాంటప్పుడు పరీక్షలు ఎలా రాస్తారు.
– ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పాఠాలు బుర్రలకెక్కలేదు
ఆన్‌లైన్ తరగతుల ద్వారా సబ్జెక్టులు పిల్లల బుర్రలకెక్కలేదు. ప్రత్యక్ష బోధన ద్వారానే సబ్జెక్టులను విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఆన్‌లైన్ బోధన సమయం వృథా ప్రయాసే తప్ప ప్రయోజనం ఉండదు. పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేస్తేనే సబబుగా ఉంటుంది.
– నవీద్, పేరెంట్, హైదరాబాద్
తెలంగాణ పదో తరగతి 2021 ఎగ్జాం టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఆదిలోనే హంసపాదు..
- కోవిడ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ఆన్‌లైన్ బోధనతో ప్రారంభమైనా.. అకడమిక్ కేలండర్ అమలుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వాస్తవంగా మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్‌ను ఖరారు చేసినా.. దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరింటినే సిద్ధం చేసేందుకు విద్యా సంవత్సరం మొత్తమ్మీద 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 30 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో 115 రోజులు, ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి మే 26 వరకు 89 రోజుల పని దినాలుగా నిర్ణయించి ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు.
- ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మే నెలలో 19 పని దినాలుగా షెడ్యూలు ఖరారు చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో మార్చి 23న తిరిగి పాఠశాలలు మూతపడ్డాయి. వాస్తవంగా 70 శాతం సిలబస్‌ను ప్రత్యక్ష బోధనతో పాటు, పరోక్ష విధానంలో బోధించాలని, మిగతా 30 శాతం సిలబస్ ప్రాజెక్టు వర్క్స్, అసైన్‌మెంట్ల ద్వారా పూర్తి చేయాలని నిర్ణయించినా.. ఆచరణలో సగం కూడా దాటలేదు.
బుర్రకెక్కింది 20 శాతమే..
- æఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీ– శాట్, దూరదర్శన్ చానళ్ల ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. ప్రైవేటులో ఫీజుల కోసం ఆన్‌లైన్ బోధన క్రమం తప్పకుండా సాగినా.. పిల్లల బుర్రకెక్కింది 20 శాతం మించలేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రత్యక్ష బోధన 40 రోజులకు పరిమితం కావడంతో మళ్లీ ఆన్‌లైన్ బోధన కొనసాగింది. ఫలితంగా సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది.
- పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు గండంగా పరిణమించాయి. చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా సెంకడ్ వేవ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్ నేపథ్యంలో బెంచీకి కేవలం ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టాల్సి ఉంటుంది. గదికి 20 మందికి సీటింగ్ కెపాసిటీ మించొద్దు. దీంతో అదనంగా పరీక్ష కేంద్రాల సంఖ్య పెరగనుంది. సెంటర్ల కోసం ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ బడులు, స్కూళ్లను తీసుకునేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టినా.. తమ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణ తలనొప్పిగా తయారైంది.
ప్రమోట్ చేయడమే ఏకైక మార్గం..
పదోతరగతి సిలబస్ పూర్తి కానప్పుడు వార్షిక పరీక్షలు ఎలా నిర్వహిస్తారు. వాస్తవానికి అకడమిక్ షెడ్యూలు అమలు కాలేదు. కరోనా సెకండ్ వేవ్‌లో భౌతికంగా పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసినట్లే. గత విద్యా సంవత్సరం మాదిరిగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయడమే ఏకైక మార్గం.
– వెంకట్ సాయినాథ్, ప్రైవేటు స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి,
సిలబస్ 40 శాతం పూర్తి కాలేదు.
ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి సిలబస్ 40 శాతం మించలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆన్‌లైన్ తరగతులు సక్రమంగా నిర్వహించలేకపోయాం. విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన కలగలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. అలాంటప్పుడు పరీక్షలు ఎలా రాస్తారు.
– ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పాఠాలు బుర్రలకెక్కలేదు
ఆన్‌లైన్ తరగతుల ద్వారా సబ్జెక్టులు పిల్లల బుర్రలకెక్కలేదు. ప్రత్యక్ష బోధన ద్వారానే సబ్జెక్టులను విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఆన్‌లైన్ బోధన సమయం వృథా ప్రయాసే తప్ప ప్రయోజనం ఉండదు. పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేస్తేనే సబబుగా ఉంటుంది.
– నవీద్, పేరెంట్, హైదరాబాద్
Published date : 13 Apr 2021 02:09PM