నేడు విడుదల కానున్న సీబీఎస్ఈ ఆఫ్‌లైన్ పరీక్షల షెడ్యూల్
Sakshi Education
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డ్ ఎగ్జామ్స్-2021 పరీక్షల షెడ్యూల్ నేడు(ఆగస్టు10, 2021) విడుదల కానుంది.
పది, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్, కంపార్ట్మెంట్, ప్రైవేటుతోపాటు కరెస్పాండెన్స్ కోర్సుల పరీక్షల కోసం ఆఫ్‌లైన్ తేదీలను సీబీఎస్ఈ బోర్డు ప్రకటించనుంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ బోర్డు జులై 30న 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఆగస్టు 3న టెన్త్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. బోర్డు విడుదల చేసిన ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు నిర్వహించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరు కావొచ్చు. 2021, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు సీబీఎస్ఈ బోర్డు ఇంప్రూవ్‌మెంట్ మరియు కంపాట్మెంట్ పరీక్షలను సీబీఎస్ఈ బోర్డు నిర్వహించనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో అభ్యర్థులకు బోర్డ్ ఎగ్జామ్స్-2021 పరీక్షల షెడ్యూల్ షీట్ అందుబాటులో ఉంటుంది.
Published date : 10 Aug 2021 07:10PM