ఈసారి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు లేవ్: పరీక్ష ఫీజు కట్టిన వారంతా పాస్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 5,21,073 మంది విద్యార్థులనూ తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసింది.
ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,16,578 మంది ఉంటే గతంలో ఫెయిలైన వారు 4,495 మంది ఉన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే వారందరనీ పాస్ చేసింది. వారికి ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 మార్కుల ఆధారంగా గ్రేడ్లను కేటాయించింది. ఇలా దరఖాస్తు చేసుకున్న అందరినీ పాస్ చేయడంతో ఈసారి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈసారి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 2,62,917 మంది బాలురు ఉండగా, 2,53,661 మంది బాలికలు ఉన్నారు.
పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకోవల్సిన కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఎక్స్‌పర్ట్స్ కెరీర్ గైడెన్స్... ఇతర సమాచారం కోసం క్లిక్ చేయండి.
పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకోవల్సిన కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఎక్స్‌పర్ట్స్ కెరీర్ గైడెన్స్... ఇతర సమాచారం కోసం క్లిక్ చేయండి.
Published date : 22 May 2021 02:11PM