Skip to main content

Word Power Championship: విద్యార్థుల్లో అత్యున్నత ప్రతిభను గుర్తించాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): చిన్నారుల మెదడుకు పదును పెడితే గొప్ప విజ్ఞాన సంపదను పొందుతారని, ఉత్తమ ప్రతిభ కనబరచడానికి, వారిలో శక్తిని వెలికితీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
High talent should be identified among students

స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌అండ్‌ ట్రైనింగ్‌, సమగ్రశిక్షా, ఆంధ్రప్రదేశ్‌ విభా, లీప్‌ ఫార్వార్డ్‌ సహకారంతో మార్చి 14న‌ విజయవాడ బెరమ్‌ పార్క్‌లో ‘వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌’ రాష్ట్రస్థాయి పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మట్టిలో మాణిక్యాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.
విభా, లీప్‌ ఫార్వార్డ్‌ సంస్థలు 2021 నుంచి విద్యాశాఖతో మమేకమై ఇంగ్లిష్‌ లిటరసీ (ఈఎల్పీ) ప్రోగ్రాం ద్వారా ఆంగ్ల పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. భాషా నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాల్లో ‘వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌’ భారతదేశపు అతిపెద్ద ఆంగ్ల పోటీగా నిర్వాహకులు పేర్కొన్నారు.

చదవండి: INSPIRE National Level: జాతీయ స్థాయి ఇన్స్‌పైర్‌ పోటీలకు ఈ విద్యార్థిని ప్రాజెక్టు ఎంపిక
2023–24 విద్యా సంవత్సరంలో రెండు నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో ఆంగ్ల అక్షరాస్యత, భాషా నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మక జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో, ఎన్టీఆర్‌ జిల్లాలో 17 మండలాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల ఏడో తేదీన జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా 24 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు.
ఐదు గ్రేడుల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విజేతలు ఏప్రిల్‌ 12న ముంబైలో జరిగే ‘గ్రాండ్‌ ఫినాలే’ పోటీలకు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్‌ కేశిరాజు శ్రీనివాస్‌, డాక్టర్‌ శారద, శామో విభాగం నుంచి అపర్ణ, వీరనారాయణ, లీప్‌ ఫార్వర్డ్‌ సంస్థ వ్యవస్థాపకులు ప్రణీల్‌ నాయక్‌, చైతన్య, చందన, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే...

రాష్ట్ర స్థాయి పోటీలకు నాలుగు విభాగాల నుంచి 24 మంది హాజర వగా గ్రేడ్‌–2 విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కె.దీపిక (ముంచిగపుట్‌) ప్రథమ స్థానం, మర్రి రాజు (చింతపల్లి) ద్వితీయస్థానం సాధించారు. గ్రేడ్‌–3 విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన బి.రేవంత్‌ కుమార్‌ (మైలవరం), మణిదీప్‌ కొంగని (కంచికచర్ల) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
గ్రేడ్‌–4లో ఏఎస్‌ఆర్‌ జిల్లా నుంచి నుంచి శ్యామ్‌ సన్‌ (చింతపల్లి) మొదటి బహుమతి, మనస్విని.కె (పాడేరు) రెండో బహుమతి దక్కించుకున్నారు. గ్రేడ్‌–5 విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి అనిల్‌ కుమార్‌ బాణావతు (మైలవరం) ప్రథమ స్థానం, జమ్మి సాత్విక్‌ (రెడ్డి గూడెం) ద్వితీయ స్థానంలో నిలిచారు.
 

Published date : 15 Mar 2024 02:52PM

Photo Stories