Harichandana: నవోదయ టు జపాన్.. సకూరా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న మన విద్యార్థిని
Sakshi Education
రాజంపేట : జపాన్ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనపై జరిగే సకూరా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రాంకు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని హరిచందన ఎంపికైంది.
నవోదయ టు జపాన్.. సకూరా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న మన విద్యార్థిని
రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లెకు చెందిన రవీంద్రారెడ్డి, సంధ్యల కుమార్తె హరిచందన నవోదయలో విద్యనభ్యసించింది. గతేడాది పదో తరగతిలో అత్యున్నత మార్కులు సాధించింది. ఫలితంగా ఏపీ నుంచి ఆమె సకూరాకు ఎంపికైంది.
జూలై 3న జపాన్‌కు వెళ్లి సకూరాలో పాల్గొని పర్యటన ముగించుకుని 20న ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ.. పలువురు శాస్త్రవేత్తలతో కలిసి అనేక చర్చల్లో పాల్గొన్నట్లు తెలిపింది. హరిచందనను ప్రిన్సిపాల్ గీత అభినందించారు.