Tenth Class Exams 2024 : 10వ తరగతి విద్యార్థుల డేటాను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు
పదో తరగతి విద్యార్థుల డేటా తయారీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుల పర్వం దాదాపుగా పూర్తయ్యింది. పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ప్రభుత్వం వెల్లడించింది. 2024 మార్చి 18 నుంచి జరిగే పరీక్షలకు జిల్లాలో ఇప్పటి వరకు 29292 మంది ఫీజులు చెల్లించారు. జిల్లాలో 589 ఉన్నత పాఠశాలల్లో 27660 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా పదో తరగతి చదువుతుడగా, ప్రైవేటు(గతంలో ఫెయిలైనవారు)గా మరో 1632 మంది పరీక్ష ఫీజులు చెల్లించారు.
తప్పులకు మూల్యం తప్పదు..
మార్చి 18వ తేదీ నుంచి మొదలుకానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాతోపాటు వారి వ్యక్తిగత సమాచారం పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే భవిష్యత్‌లో విద్యార్థుల మార్క్స్ మెమోలో తలెత్తే తప్పులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యులని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పాఠశాల విద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read : AP 10th Class Study Material
నామినల్స్ సవరణకు ఛాన్స్..
ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు ప్రభ్వుతం సన్నద్ధమైంది. దీంతో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి జన్మదినం, మీడియం, విద్యార్థి ఫొటో, సంతకం, ఆధార్‌కార్డు నంబర్, పుట్టుమచ్చలు, మొదటి, ద్వితీయ భాష, విద్యార్థి వైకల్యం, ఓఎస్‌ఎస్‌సీ సబ్జెక్ట్/కోడ్, తదితర సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. దీంతో ఒకవేళ పొరపాటున కంప్యూటర్‌లో డేటా నమోదు సమయంలో దోషాలు జరిగితే తప్పుల సవరణకు ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ‘ఎడిట్’ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : TSWREIS, Hyderabad Inter Admission 2024 Notification
అయితే పీహెచ్‌సీ విద్యార్థుల సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసిసిన కాపీని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంబంధిత సెక్షన్‌లో ఒరిజినల్, జిరాక్స్ కాపీలను ఈనెల 25వ తేదీలోగా తీసుకువచ్చి ధృవీకరించుకుని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై డీఈఓ కె.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఒకటికి రెండు సార్లు సరి చూసుకుని డేటా నమోదు చేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు అన్యాయం చేయకూడదనే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇచ్చిందని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్ తెలిపారు.