AP 10th Class Students : టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు రీజాయినింగ్ అవకాశం.. ఎలా అంటే..?
Sakshi Education
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు పాఠశాలల్లో రీజాయినింగ్ విధానాన్ని తీసుకువచ్చినట్లు విజయనగరం డిప్యూటీ డీఈఓ పి బ్రహ్మాజీరాజు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతి తప్పిన విద్యార్థులకు ప్రామాణికాలు పెంచి వారిని ఉత్తీర్ణులను చేసేందుకు మరింత శ్రద్ధ వహించనున్నట్లు చెప్పారు.
బొబ్బిలి డివిజన్‌లో ఇలా తప్పిన విద్యార్థులు పది మండలాల్లో 748 మంది ఉన్నట్లు గుర్తించామని వారిని ఆయా పాఠశాలల్లో చేర్పించి పదో తరగతి ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదునిచ్చి వారికి అమ్మ ఒడి నిధులు కూడా తల్లుల ఖాతాల్లో మళ్లీ జమ చేయనున్నామన్నారు.
పేద పిల్లలకు ప్రైవేట్‌లో స్కూల్స్‌లో..
జిల్లాలో తెల్ల రేషన్ కార్డున్న పేద పిల్లలకు 3 కిలోమీటర్ల లోపున్న ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. లాటరీ ద్వారా ఈ సీట్లు కేటాయించి, ఫీజులు లేకుండా విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Published date : 18 Jul 2023 05:14PM