Skip to main content

Free Coaching :పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌
Free Polytechnic and APRGC Coaching Center  Free Coaching   Free coaching for Polytechnic and APRGC exams  Educational opportunity
Free Coaching :పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌

విజయవాడ:పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌, ఏపీఆర్జేసీకి సంబంధించిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ మాట్లాడుతూ విద్యార్థులు పదోతరగతి తర్వాత జీవితంలో స్థిరపడడానికి మంచి విద్యను ఎన్నుకోవడానికి పాలిటెక్నిక్‌ ఏపీఆర్జేసీ లాంటి పరీక్షలకు కోచింగ్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మ్యాథమెటిక్స్‌, భౌతికశాస్త్రానికి సంబంధించిన అనేక కాంపిటేటివ్‌ పరీక్షలకు బిట్స్‌ తయారుచేయడంతో మంచి నాలెడ్జి వస్తుందని తెలిపారు. 25 ఏళ్లుగా ఉచితంగా అనేక మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నామని వివరించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ పనిచేస్తుందని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.

AP POLYCET Previous Papers

 

Published date : 03 Apr 2024 12:44PM

Photo Stories