ఏపీ టెన్త్- 2021 పరీక్షలకు కొత్త నమూనా.. ప్రశ్నపత్రం ఎలా ఉంటుందంటే...
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్‌త పబ్లిక్ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు.
కోవిడ్ వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో పదో తరగతిలోని 11 పేపర్లను 7కు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయాలజీ పేపర్లకు 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు కానుంది. ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి.. మిగిలిన 20 మార్కులను అంతర్గత మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. గతేడాది ఈ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించి ప్రశ్నపత్రాల ప్యాట్రన్‌లో మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానంలోనూ కొన్ని సవరణలు చేసింది. గతేడాది పరీక్షల నిర్వహణ లేకపోవడంతో.. అవి అమలు కాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త ప్యాట్రన్, గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2.30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారు.
ప్రశ్నల కేటగిరీ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం (నిమిషాలు) |
ఆబ్జెక్టివ్ అతి స్వల్ప | 12 | 12 | 18 |
సమాధానాలు | 8 | 16 | 24 |
స్వల్ప సమాధానాలు | 8 | 32 | 48 |
వ్యాసరూప సమాధానాలు | 5 | 40 | 60 |
మొత్తం | 33 | 100 | 150 (2.30 గంటలు) |
Published date : 05 Feb 2021 05:31PM