PARIKSHA PARV: విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు
నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఉపాధ్యాయులు, పేరెంట్స్‌కు పరీక్షా పర్వ్ పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల ఇష్టాలను, వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త సీహెచ్ విజయజ్యోతి కుమారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలన్నారు. ప్రధాన వక్త చిట్టిబాబు మాట్లాడుతూ.. విద్యార్థులకు పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఉప విద్యాధికారి హనుమంతరావు, ఆఫీస్ పర్యవేక్షకులు కోటేశ్వరరావు, సెక్టోరియల్ ఆఫీసర్స్ కె.సునీతా రెడ్డి, జి.సురేష్ రాజు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.