Tenth Examinations: 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ..
Sakshi Education
మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి అన్నారు.
సాక్షి ఎడ్యుకేషన్: గురువారం పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో పరీక్షా కేంద్రాలకు తరగతి గదులను డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం సామ్రాజ్యంతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని గదులు ఉన్నాయి, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం ఉన్నాయా అని ఆరా తీశారు.
DSC 2008: ఎస్‌జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
డీఈఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ప్రతి గదిలో తప్పనిసరిగా ఫర్నీచర్, లైటింగ్, నీటి సదుపాయం ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గదుల్లో ఫర్నీచర్, లైటింగ్ సౌకర్యాలు లేకపోతే ఏర్పాటు చేయాలని సూచించారు.
Published date : 09 Feb 2024 12:37PM