Skip to main content

దూరవిద్య టెన్త్, ఇంటర్ 2020-21 ప్రవేశాలకు నోటిఫికేషన్

గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2020-21 విద్యాసంవత్సరానికి దూరవిద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్లు ఆ సంస్థ డెరైక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
గుంటూరులోని సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కార్యాలయంలో గురువారం దూరవిద్య టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు మీ-సేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా అక్టోబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. కోవిడ్-19 వల్ల వాయిదా పడిన దూరవిద్య టెన్‌‌త, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్వహిస్తామన్నారు.
Published date : 11 Sep 2020 02:31PM

Photo Stories