Digital Education: విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బోధించే పాఠాన్ని విన్న ముఖ్యమంత్రి
హెలిప్యాడ్‌నుంచి ఆయన నేరుగా పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బోధించే పాఠాన్ని విన్నారు. విద్యార్థులు ఏ మేర అర్థం చేసుకుంటున్నారో పరిశీలించారు. పాఠశాలలో నాడు–నేడులో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌బీ, గ్రీన్ బోర్డులను పరిశీలించారు.
ఉపాధ్యాయులు బోధన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోరిన మేరకు వారితో సెల్ఫీ దిగారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గత ఏడాది అందించిన ట్యాబ్‌లను ఎంతవరకు వినియోగిస్తున్నారో, ఏమేర వారికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు.
చదవండి: Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమలుపై అభిప్రాయాలు ఇవే..
నాడు–నేడు పథకంలో ఏర్పాటుచేసిన ప్లాంట్‌ను పరిశీలించి, ఆ నీటిని తాగారు. ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రామరాజుపడాల్, ఉపాధ్యాయులు ప్రసాదరావు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.