బ్రేకింగ్ న్యూస్: టెన్త్ పరీక్షలు రద్దు..12వ తరగతి పరీక్షలు వాయిదా
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర విద్యాశాఖ ఏఫ్రిల్ 14వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అలాగే 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసింది. మే 4వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇతర విద్యాశాఖ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. బోర్డ్ తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలను వెల్లడిస్తామన్నారు.అలాగే జూన్ 1 కరోనా పరిస్థితి సమీక్షించిన తర్వాత 12వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటిస్తామన్నారు.
Published date : 14 Apr 2021 02:53PM