Good News: వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
Sakshi Education
రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు.
అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. మరోవైపు ఏపీలోని జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించారు. తిరిగి జూన్ 13న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.
Published date : 15 Apr 2022 05:14PM