AP 10th Class Exams : జూన్ 20వ తేదీ వరకే సప్లిమెంటరీ ఫీజు గడువు.. ఒక వేళ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా..
ఫీజు చెల్లింపు గడువు జూన్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
AP 10th Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సప్లిమెంటరీ పరీక్షల్లో..
MPC Course Benefits : ఇంటర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఇవే..
ఒక వేళ ఎక్కువ వచ్చిన మార్కులు వస్తే..
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్‌మెంట్ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
After 10th Bipc Courses Benefits : ఇంటర్‌లో 'బైపీసీ' కోర్సు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏటంటే..?
ఫెయిలైన విద్యార్థుల కోసం.. ప్రత్యేకంగా..
ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో జూన్ 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది.సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు.